హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం పట్ల తెలుగు తల్లి సిగ్గుతో కన్నీరు పెడుతోంది – కె. రాఘవేంద్రరావు

Published on Sep 24, 2022 9:01 pm IST

ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా విజయవాడ లోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ యొక్క పేరుని మార్చి, దానికి దివంగత కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుని పెడుతున్నట్లు బిల్ ప్రెవేశపెట్టిన విషయం తెలిసిందే. దానితో ఒక్కసారిగా అనేకమంది తెలుగు దేశం పార్టీ నాయకులు, ఇతర పార్టీల నేతలతో పాటు పలువురు సినిమా ప్రముఖులు సైతం దానిని తీవ్రంగా వ్యతిరేకించారు.

ఎన్నో ఏళ్ళ క్రితం అన్న ఎన్టీఆర్ గారిచే ప్రారంభించబడి ఆయన పేరుతో కొనసాగుతున్న యూనివర్సిటీ పేరుని ఉన్నట్లుండి మారుస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని అటు ఎన్టీఆర్ కుమారులైన బాలకృష్ణ, రామకృష్ణ ఇప్పటికే ఖండించారు. ఇక తాజాగా కొద్దిసేపటి క్రితం టాలీవుడ్ శతాధిక చిత్రాల దర్శకుడు కె రాఘవేంద్రరావు దీనిపై తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా స్పందించారు. ‘తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన పేరుతో ఉన్న హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం పట్ల తెలుగు తల్లి సిగ్గుపడుతోంది, కన్నీరు పెడుతోంది’ అంటూ ఆయన పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం :