ఇంట‌ర్వ్యూ: ‘ఉషా పరిణ‌యం’ ఓ చ‌క్క‌టి ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ – కె.విజ‌య్ భాస్క‌ర్

ఇంట‌ర్వ్యూ: ‘ఉషా పరిణ‌యం’ ఓ చ‌క్క‌టి ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ – కె.విజ‌య్ భాస్క‌ర్

Published on Jul 27, 2024 3:28 PM IST

టాలీవుడ్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలుగా నిలిచిన ‘నువ్వేకావాలి’, ‘మ‌న్మ‌థుడు’, ‘మ‌ల్లీశ్వ‌రి’ వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు కె.విజ‌య్‌భాస్క‌ర్ తాజాగా మ‌రో ల‌వ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీతో మ‌నముందుకు రాబోతున్నారు. ‘ఉషా ప‌రిణ‌యం’ అనే టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రానికి ‘ల‌వ్ ఈజ్ బ్యూటిఫుల్’ అనేది ఉప‌శీర్షిక‌. ఈ సినిమాలో శ్రీ‌క‌మ‌ల్‌, తాన్వీ ఆకాంక్ష‌, సూర్య మెయిన్ లీడ్ గా న‌టించారు. ఆగస్టు 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేప‌థ్యంలో డైరెక్ట‌ర్ కె.విజయ్‌భాస్కర్‌ మీడియాతో ముచ్చటించారు.

చాలా గ్యాప్ త‌రువాత ‘ఉషా పరిణయం’తో రాబోతున్నారు.. ఇది ఎలాంటి కథ?

ఉషా పరిణయం ప్రేమకు నేను ఇచ్చే నిర్వచనం. ఈ మధ్య ప్రేమకు అర్థం మారిపోయింది. ప్రేమ పేరుతో అమ్మాయిలపై దాడులు జరగడం ఎక్కువైపోయింది. అలాంటిది జరిగినప్పుడు అందరూ ప్రేమోన్మాదం అని రాస్తున్నారు. అలా రాయకండి అంది ఓన్లీ ఉన్మాదం. లవ్‌ అనేది ఎప్పుడూ హింసాత్మకంగా ఉండదు. అలా నా స్టయిల్‌లో చెప్పాలనుకున్నాను. ఈ పాయింట్‌తో ఓ కథ చెప్పాలనుకుని ఈ సినిమాను తీశాను. ఇది యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌. అండర్‌ కరెంట్‌తో ట్రూలవ్‌ ను చూపించాల‌నుకున్నాను.

కమల్‌ కెరీర్‌కు ఇది ఎలాంటి సినిమాగా నిలుస్తుంది..?

ఇంతకు ముందు కమల్‌ చేసిన సినిమా ఓన్లీ ఎంటర్‌టైనింగ్‌ సినిమా. ఇది ఇంటెన్సిటీ ప్రేమకథ సినిమా. ఈ సినిమాతో తాన్వీ ఆకాంక్ష అనే తెలుగమ్మాయిని హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నాం. మసాలా తరువాత నువ్వు నాకు నచ్చావ్‌ జానర్‌లో ఉన్న సినిమా చేసిన ఫీల్‌ కలిగింది.

ప్రేక్షకుల అభిరుచి మారింది? ఇప్పటి ప్రేక్షకులను ఉషా పరిణయం ఎంతవరకు మెప్పిస్తుంది..?

ఆడియన్స్‌ టేస్ట్‌ మారింది అనే విషయాన్ని నేను ఒప్పుకోను. 100 ఏళ్లు అయినా ప్రేక్షకుల అభిరుచి మారదు. చక్కగా ఎంటర్‌టైన్‌ చేయగలిగితే ఆడియన్స్ త‌ప్ప‌క‌ చూస్తారు. ఎన్ని మారినఆ, ఎన్ని ఫ్లాట్‌ఫామ్ లు వచ్చినా కథలో అన్ని సమపాళ్లలో జోడిస్తే సినిమాలు తప్పకుండా చూస్తారు. థియేటర్‌కు వస్తారు.

ఈ సినిమాలోని పాట‌ల గురించి..?

చాలా రోజుల తరువాత నాకు మనస్పూర్తిగా అన్ని మంచి పాటలు ఆడియన్స్‌కు ఇచ్చామనే ఫీలింగ్‌ ఈ సినిమాతో కలిగింది. ఆర్‌.ఆర్‌ ధ్రువన్ నా కథకు తగ్గట్టుగా చాలా మంచి సంగీతం ఇచ్చాడు. సంగీతం అనేది స్ట్రిప్ట్‌లో ఉండాలి అనేది నా ఫీలింగ్‌.

ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయా?

సినిమా యూత్‌ఫుల్‌గా ఉంటుంది. కానీ మా టార్గెట్‌ మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌. అందరూ కలిసి భోజనం చేసినట్లు అందరూ కలిసి కూర్చొని చూసే సినిమా వస్తే బాగుంటుంది. మంచి సినిమాలు చూస్తే ఆరోగ్యం బాగుంటుంది. ఒక తరగతికి మాత్రమే శాటిస్‌ఫాక్షన్‌ అయ్యేలా సినిమా తీస్తే ఎలా అనేది నా ఫీలింగ్‌. ఈ సినిమా తప్పకుండా అందరూ ఫ్యామిలీతో కలిసి చూసే విధంగా ఉంటుంది.

ఈ సినిమాకు ఉషా ప‌రిణయం అనే టైటిల్ ఎందుకు పెట్టారు..?

ఇదొక క్లాసిక్‌ టైటిల్‌. నాకు ఎప్పట్నుంచో ఈ టైటిల్‌తో సినిమా చేయాలని కోరిక ఉంది. ఇన్నాళ్లకు కుదిరింది. ఇందులో హీరోయిన్‌ పేరు కూడా ఉషా. సినిమా అంతా ఆమె పెళ్లి గురించి ఉంటుంది. లవ్‌ఈజ్‌ బ్యూటిఫుల్‌ అనే క్యాష్పన్‌ ఎందుకు పెట్టామో సినిమ చూస్తే అర్థమవుతుంది. ప్రేమ అనేది ఎంతో నోబుల్‌ ఎమోషన్‌. ఈ రోజు కథల్లో అది మిస్‌ అవుతుంది. థియేటర్ కు రావాలనే ఫీలింగ్ ఈ సినిమా కలిగిస్తుందని న‌మ్ముతున్నాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు