‘క’ మాస్ జాతర సాంగ్.. ఊరమాస్!

‘క’ మాస్ జాతర సాంగ్.. ఊరమాస్!

Published on Oct 7, 2024 8:10 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘క’ షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకులు సుజిత్, సందీప్‌లు తెరకెక్కిస్తుండగా, పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా రూపొందుతోంది. ఇక ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరికొత్త గెటప్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఈ చిత్రం నుండి ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై అంచనాలను క్రియేట్ చేశాయి. అయితే, తాజాగా ఈ సినిమా నుండి ‘క మాస్ జాతర’ అనే సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. జాతర నేపథ్యంలో సాగే ఈ సాంగ్‌ని పూర్తిగా ఊరమాస్ బీట్స్‌తో రూపొందించారు. ఇందులో కిరణ్ అబ్బవరం వేసే స్టెప్పులకు థియేటర్లలో ఆడియెన్స్ కూడా డ్యాన్స్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది.

సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో తాన్వి రామ్, నయన్ సారిక ఫీమేల్ లీడ్స్‌గా నటిస్తున్నారు. అయితే, ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ని మాత్రం మేకర్స్ ఇంకా ప్రకటించకపోవడం గమనార్హం.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు