సమీక్ష : క – ఆకట్టుకునే సస్పెన్స్ డ్రామా!

సమీక్ష : క – ఆకట్టుకునే సస్పెన్స్ డ్రామా!

Published on Oct 31, 2024 10:32 AM IST
KA Movie Review in Telugu

విడుదల తేదీ : అక్టోబర్ 31, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వి రామ్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్ తదితరులు.

దర్శకుడు : సందీప్, సుజిత్

నిర్మాతలు : చింతా గోపాల్ కృష్ణ రెడ్డి

సంగీత దర్శకుడు : సామ్ సీఎస్

సినిమాటోగ్రఫీ : సతీష్ రెడ్డి మసాన్, డేనియల్ విశ్వాస్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

కథ :

అభినయ్ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) ఓ అనాథ. తన వాళ్ళ కోసం చిన్నతనం నుంచి పరితపిస్తూ ఉంటాడు. తన వాళ్ళ పై తనకు ఉన్న ప్రేమ కారణంగానే అనాధ ఆశ్రమం నుంచి పారిపోతాడు. ఈ క్రమంలో తన మాస్టర్ గురునాథం (బలగం జయరామ్) వద్ద ఉన్న డబ్బుని కాజేసి పారిపోతాడు. ఐతే, అభినయ్ వాసుదేవ్ కి చిన్న తనం నుంచే ఎదుటి వాళ్ల ఉత్తరాలు చదవడం బాగా ఇష్టం. అలా చదువుతూ తన సొంత వాళ్లే రాసినట్టుగా ఫీల్ అవుతుంటాడు. అలాంటి వాసుదేవ్ కృష్ణగిరి ప్రాంతానికి వచ్చి పోస్ట్ మేన్ ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. ఆ ఊరిలోనే సత్యభామ (నయని సారిక)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా వాసుదేవ్ ప్రేమలో పడుతుంది. ఐతే, మరోవైపు ఆ ఊరిలోని అమ్మాయిలు మిస్ అవుతూ ఉంటారు. అమ్మాయిల మిస్సింగ్ వెనకాల ఉన్నది ఎవరు ?, ఆ ఊరి అమ్మాయిలను వాసుదేవ్ ఎలా సేవ్ చేశాడు ?, చివరకు అభినయ్ వాసుదేవ్ కథ ఎలా మలుపు తిరిగింది ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ ‘క’ చిత్రంలో.. మెయిన్ కాన్సెప్ట్, క్లైమాక్స్ అలాగే క్యారెక్టర్స్ ను రాసుకున్న తీరు, వాటి పాయింట్ ఆఫ్ వ్యూలో రివీల్ అయ్యే ట్విస్ట్ లు బాగున్నాయి. బ్యాక్‍ డ్రాప్ కూడా సినిమాకి ప్లస్ అయింది. సుజీత్, సందీప్ ల టేకింగ్ కూడా బాగుంది. కొన్ని కీలక సన్నివేశాలు.. ముఖ్యంగా ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ గ్రిప్పింగ్‍గా సాగాయి. అదేవిధంగా సినిమాలో కొన్ని సప్సెన్స్ సీన్స్ ఆకట్టుకున్నాయి.

అభినయ్ వాసుదేవ్ పాత్రలో కిరణ్ అబ్బవరం చాలా బాగా నటించాడు. రెండు వేరియేషన్స్ లో పాత్రకు తగ్గట్టుగా కిరణ్ అబ్బవరం నటించిన విధానం బాగుంది. అలాగే, అభినయ్ వాసుదేవ్ పాత్ర ముగింపు కూడా కొత్తగా ఉంది. హీరోయిన్ పాత్రలో నయన్ సారిక బాగా నటించింది. మరో కీలక పాత్రలో నటించిన తన్వి రామ్ కూడా హోమ్లీ లుక్స్ లో ఆమె తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. నటుడు అచ్యుత్ కుమార్ తన నటనతో ఆకట్టుకున్నారు.

అదేవిధంగా ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించిన బలగం జయరామ్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. దర్శకులు సందీప్, సుజిత్ తీసుకున్న మెయిన్ పాయింట్, అండ్ ఆ పాయింట్ ను ఎలివేట్ చేస్తూ రాసుకున్న కొన్ని సస్పెన్స్ సీన్స్ బాగున్నాయి. చావు పుట్టుకల నేపథ్యంలో అల్లిన డ్రామా కూడా బాగుంది.

 

మైనస్ పాయింట్స్:

ఈ ‘క’ సినిమాలో ఇంట్రెస్టింగ్ థీమ్ ఉన్నా.. కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే స్లోగా సాగుతుంది. అలాగే మెయిన్ కాన్ ఫ్లిక్ట్ ని క్లారిటీగా ఎలివేట్ చేయకుండా పూర్తి సస్పెన్స్ పాయింటాఫ్ వ్యూలో స్క్రీన్ ప్లేని సాగతీయడంతో.. మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడం వంటి అంశాలు మైనస్ అయ్యాయి. అయితే, దర్శకుల దర్శకత్వ పనితనం సినిమా పై ఆసక్తిని కలిగించినప్పటికీ… అదే విధంగా వారు రాసుకున్న కాన్సెప్ట్, కొన్ని సన్నివేశాలు మరియు క్లైమాక్స్ సీన్స్ బాగున్నప్పటికీ.. కథనం కూడా ఇంకా బెటర్ రాసుకుని ఉండి ఉంటే బాగుండేది. మొత్తానికి దర్శకులు సినిమాని ఇంట్రెస్టింగ్ గా మొదలు పెట్టి.. ఆ తర్వాత అనవసరమైన సీన్స్ తో కథను డైవర్ట్ చేసి, ల్యాగ్ సీన్స్ తో ఆసక్తిని పోగొట్టి, చివరకు క్లైమాక్స్ తో ఆకట్టుకున్నారు.

 

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. దర్శకులు సందీప్, సుజిత్ ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కి గుడ్ ట్రీట్మెంట్ ను యాడ్ చేసి బాగానే ఆకట్టుకున్నారు. అయితే, స్క్రీన్ ప్లే ఇంకొంచెం బెటర్ గా రాసుకొని ఉండాల్సింది. సినిమాలో సతీష్ రెడ్డి మసాన్, డేనియల్ విశ్వాస్ ల సినిమాటోగ్రఫీ బాగుంది. కీలక దృశ్యాలతో పాటు సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను వారు చాలా బాగా చూపించారు. సామ్ సీఎస్ సంగీతం బాగుంది. ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంది. నిర్మాత చింతా గోపాల్ కృష్ణ రెడ్డి ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.

 

తీర్పు :

‘క’ అంటూ వచ్చిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా మెయిన్ థీమ్, క్యారెక్టర్ల పాయింట్ ఆఫ్ వ్యూస్ మరియు క్లైమాక్స్ అండ్ కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగున్నాయి. అయితే, కొన్ని సీన్స్ రెగ్యులర్ గా అండ్ స్లోగా సాగడం వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి. ఓవరాల్ గా సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది. ఇక మిగిలిన వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా యావరేజ్ అనిపిస్తుంది.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు