టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం చాలా రోజుల తర్వాత క అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇండస్ట్రీ లో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్ ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రం యొక్క తెలుగు థియేట్రికల్ రైట్స్ ను వంశీ నందిపాటి 12 కోట్ల రూపాయలకి సొంతం చేసుకున్నారు. అంతేకాక మిగతా భాషల్లో మరియు నాన్ థియేట్రికల్ హక్కులను 18 కోట్ల రూపాయలకి సొంతం చేసుకున్నారు. రిలీజ్ కి ముందే 30 కోట్ల రూపాయల బిజినెస్ రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది.
అయితే రిలీజైన టీజర్ ఇందుకు కారణం అని చెప్పాలి. సినిమా పై అందరిలో ఆసక్తి కలగడానికి కారణం టీజర్. ఈ పాన్ ఇండియా మూవీలో తన్వి రామ్, నయన్ సారిక ఫీమేల్ లీడ్ రోల్స్ లో నటిస్తుండగా, సుజిత్, సందీప్ లు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ మూవీకి సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.