సల్మాన్ భారీ సినిమాలో జాయిన్ అయ్యిన ‘సత్యభామ’


ప్రస్తుతం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా దర్శకుడు ఎ ఆర్ మురుగదాస్ కాంబినేషన్ లో చేస్తున్న భారీ చిత్రం “సికందర్” కోసం అందరికీ తెలిసిందే. మళ్లీ చాలా కాలం తర్వాత సల్మాన్, మురుగదాస్ చేస్తున్న సినిమా ఇది కావడంతో భారీ అంచనాలు ఈ సినిమాపై నెలకొన్నాయి. ఇక ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా పూర్తి అవుతుండగా ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది.

అయితే ఈ చిత్రంలో రష్మికాతో పాటుగా మరో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా నటిస్తుంది అని రీసెంట్ గానే బజ్ వచ్చింది. అయితే ఇప్పుడు ఇది నిజం అయ్యింది. కాజల్ ఈ భారీ సినిమాలో జాయిన్ అయ్యినట్టుగా రష్మికానే తన సోషల్ మీడియాలో స్టోరీ పెట్టింది. దీనితో సత్యభామ కూడా ఈ సినిమాలో ఉందని కన్ఫర్మ్ అయ్యిందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి సల్మాన్ ఖాన్ అలాగే తన ఫ్రెండ్ సాజిద్ నదియాద్వాలా నిర్మాణం వహిస్తుండగా వచ్చే ఏడాది ఈద్ కానుకగా రిలీజ్ కానుంది.

Exit mobile version