మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్నాళ్ల పాటు అలా అగ్ర తారల ఏలిన స్టార్ హీరోయిన్స్ లో కాజల్ అగర్వాల్ కూడా ఒకరు. ఇప్పటికి కూడా మంచి ఆఫర్స్ ను సొంతం చేసుకొని సెటిల్డ్ గా తన కెరీర్ ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్నాళ్ల కితమే కాజల్ వివాహం చేసుకొని తన భర్త గౌతమ్ కిచ్లు తో హ్యాపీ లైఫ్ ని సాగిస్తుంది.
మరి ఇదిలా ఉండగా ఆమెకు కూడా నెటిజన్స్ నుంచి కాస్త చేదు అనుభవం ఎదురైనట్టు తన లేటెస్ట్ పోస్ట్ ద్వారా క్లియర్ అవుతుంది. ముఖ్యంగా ఆడవారి పట్ల వారి బాడీ షేమింగ్ కోసం కామెంట్స్ చేస్తున్న వారికి గట్టి రిప్లై ఇవ్వడం ఆసక్తిగా మారింది. తన లైఫ్ లో ఇప్పటి వరకు చాలానే మార్పులు చేర్పులు చూసాను అలాగే వాటితో పాటుగా కొన్ని నెగిటివ్ కామెంట్స్ మరియు మెసేజ్ లు మీమ్స్ వంటివి కూడా వస్తుండడం చూసాను.
ప్రెగ్నన్సీ టైం ఏ ఆడది అయినా తన శరీరంలో అనేక మార్పులు చూస్తుంది. తన లోపల బేబీ పెరుగుతున్న క్రమంలో ఆమె తనలో కూడా పెరుగుదలను గమనిస్తుంది ఇవన్నీ ప్రకృతి సహజం. అందుకని మేము ఒకే దగ్గర ఉండిపోవాలని ఒకేలా ఉండాలని అనుకోరు అలా జరగదు ఈ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని ఎంజాయ్ చెయ్యాలి.
ప్రెగ్నన్సీ అనేది ఎల్ల కాలం ఉండదు ఎప్పుడు ఫిజికల్ గా ఫిట్ గా ఉండడం, యోగా ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే మళ్ళీ ఎవరైనా నార్మల్ అవుతారని క్లుప్తంగా ఒక పెద్ద మెసేజ్ తోనే కాజల్ తనపై తన లాంటి ఆడవాళ్లపై నెగిటివ్ కామెంట్స్ చేసేవారు అందరికీ గట్టి సమాధానం ఇచ్చింది. దీనితో అభిమానులు సహా అనేకమంది స్త్రీలు కూడా తన సమాధానంకి మద్దతు ఇస్తున్నారు.
— Kajal Aggarwal (@MsKajalAggarwal) February 9, 2022


