ఓటిటిలో అదరగొడుతున్న కాజల్ సినిమా.!

ఓటిటిలో అదరగొడుతున్న కాజల్ సినిమా.!

Published on Jun 30, 2024 2:00 PM IST

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మెయిన్ లీడ్ లో నటించిన లేటెస్ట్ చిత్రం “సత్యభామ” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రాన్ని సుమన్ చిక్కాల దర్శకత్వం వహించగా ఈ చిత్రం రీసెంట్ గానే థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. అయితే ఈ చిత్రం కాజల్ కెరీర్ లో బెంచ్ మార్క్ చిత్రం 60వ సినిమాగా రాగా ఇది అనుకున్న రేంజ్ లో రెస్పాన్స్ ని అందుకోలేదు కానీ ఓటిటి లో మాత్రం సాలిడ్ రెస్పాన్స్ ని అందుకున్నట్టుగా తెలుస్తుంది.

జస్ట్ రీసెంట్ గానే సినిమా ఓటిటిలో ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి రాగా ఈ చిత్రం ఇందులో అదరగొడుతుంది. తెలుగులో నెంబర్ 1 స్థానంలో ఈ సినిమా ట్రెండ్ అవుతుండగా ఓవరాల్ ఇండియా వైడ్ గా నెంబర్ 2 లో ట్రెండ్ అవుతుంది. దీనితో ఓటిటిలో మాత్రం కాజల్ సినిమాకి మంచి రెస్పాన్స్ నే దక్కింది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించగా శశి కిరణ్ తిక్క, బాబీ తిక్క నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు