ఓటీటీ స్ట్రీమింగ్‌కి వచ్చేస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ ‘కలి’

యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటించిన రీసెంట్ మూవీ “కలి”. ఈ చిత్రాన్ని ప్రముఖ కధా రచయిత కె.రా‌ఘవేంద్ర రెడ్డి సమర్పణలో “రుద్ర క్రియేషన్స్” సంస్థ నిర్మించారు. శివ శేషు దర్శకత్వం వహించారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఈ నెల 4వ తేదీన థియేట్రికల్ రిలీజ్‌కు వచ్చి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది. ఈ నెల 17వ తేది నుంచి “కలి” ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది.

ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచలను కొద్ది సేపు నియంత్రించుకుంటే ఎన్నో ప్రాణాలు నిలుస్తాయనే పాయింట్‌తో “కలి” సినిమా రూపొందింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, మంచి మ్యూజిక్, ఎంటర్‌టైన్ చేసే క్యారెక్టర్స్ తో ఈ సినిమా ప్రేక్షకుల్ని థియేటర్స్ లో ఆకట్టుకుంది. ఇప్పుడు ఈటీవీ విన్ లోనూ మరింతగా మూవీ లవర్స్ ఆదరణ పొందనుందని మేకర్స్ ఆశిస్తున్నారు.

ఈ సినిమాలో నేహా కృష్ణన్, గౌతంరాజు, గుండు సుదర్శన్, కేదార్ శంకర్, మని చందన, మధుమణి. తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. జీవన్ బాబు ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Exit mobile version