సమీక్ష: “కలి” – కొన్ని మూమెంట్స్ వరకు మాత్రమే

సమీక్ష: “కలి” – కొన్ని మూమెంట్స్ వరకు మాత్రమే

Published on Oct 4, 2024 11:01 PM IST
Kali Movie Review in Telugu

విడుదల తేదీ : అక్టోబర్ 04, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : ప్రిన్స్, నరేష్ అగస్త్య, నేహా కృష్ణన్, సివిఎల్ నరసింహ రావు, కేదార్ శంకర్

దర్శకుడు : శివ శేషు

నిర్మాతలు : టి లీలా గౌతమ్

సంగీత దర్శకుడు : జే బి(జీవన్ బాబు)

సినిమాటోగ్రఫీ : రమణ జాగర్లమూడి, నిశాంత్

ఎడిటర్ : విజయ్ వర్ధన్.

సంబంధిత లింక్స్: ట్రైలర్

ఈ వారం థియేటర్స్ లోకి పలు చిన్న చిత్రాలు విడుదలకి వచ్చాయి. మరి వీటిలో టాలెంటెడ్ నటులు ప్రిన్స్, నరేశ్ అగస్త్య ముఖ్య పాత్రల్లో నటించిన థ్రిల్లర్ చిత్రం “కలి” కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.

 

కథ:

ఇక కథలోకి వస్తే.. శివరాం (ప్రిన్స్) తన అతి మంచితనం అందరినీ నమ్మడం మూలాన ఆర్ధికంగా మానసికంగా చితికిపోతాడు. దీనితో తన భార్య కూడా దూరం అయ్యిపోతుంది. దీనితో చనిపోదాం అని సిద్ధం అవుతాడు. ఈ సమయంలో తన మరణాన్ని ఆపి ఒకతను (నరేష్ అగస్త్య) ఒక ఆట ఆడుదాం అని అంటాడు. ఇంతకీ తన ఆత్మహత్యని ఆపింది ఎవరు?తాను చెప్పిన ఆ అట ఏంటి? దాని వెనుక ఉన్న మర్మం ఏంటి? ఇంతకీ శివరాం బతుకుతాడా చనిపోతాడా అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి.

 

ప్లస్ పాయింట్స్:

ఈ చిత్రంలో ఆరంభమే ఒకింత ఆసక్తిగా సాగుతుంది. మనుషుల్లోని మంచి చెడులని నాలుగు యుగాలు వాటిలో ధర్మం అధర్మాలు, సత్యం వంటివి ఎలా సాగుతాయి. అనే పాయింట్ ని దర్శకుడు యునిక్ గా స్టార్ట్ చేసాడు. అలాగే సినిమాలో ప్రిన్స్, నరేష్ అగస్త్యాలు అయితే సాలిడ్ పెర్ఫామెన్స్ ని అందించారని చెప్పాలి.

ముఖ్యంగా సెకండాఫ్ లో ఇద్దరు నడుమ సన్నివేశాలు మంచి ఆసక్తికరంగా సాగుతాయి. ఇద్దరి మధ్య మాటలు, ఎత్తుకి పై ఎత్తులు, ట్విస్ట్ లు ఆడియెన్స్ ని థ్రిల్ చేస్తాయి. అలాగే అక్కడక్కడా చిన్న కామెడీ సీన్స్ పర్వాలేదనిపిస్తాయి. ప్రియదర్శి, మహేష్ విట్టా వాయిస్ ఓవర్ లో ఈ సీన్స్ బాగున్నాయి. అలాగే ఇంట్రెస్టింగ్ గా మొదలైన సెకండాఫ్ ప్రీ క్లైమాక్స్ పోర్షన్ వరకు మంచి ఆసక్తిగా సాగుతుంది. ఇక ఇతర పాత్రల్లో కనిపించిన నేహా కృష్ణన్, సీవీఎల్ నరసింహారావు,కేదార్ శంకర్ లు తమ రోల్స్ లో మెప్పిస్తారు.

 

మైనస్ పాయింట్స్:

ఈ సినిమా నిడివి కేవలం 90 నిమిషాలే అయినప్పటికీ కథనం చాలా చోట్ల ఒకింత బోర్ కొట్టించేలా అనిపిస్తుంది. మెయిన్ గా ఫస్టాఫ్ లో ఇలా చాలా సేపు అనిపిస్తుంది. టైటిల్ కార్డ్స్ తో సినిమాపై ఆసక్తి రేగుతుంది. కానీ ప్రిన్స్, తన భార్యపై చూపించిన లవ్ సీన్స్ పరమ రొటీన్ గా బోర్ కొట్టించేలా అనిపిస్తాయి.

అలాగే వారిద్దరి నడుమ రొమాంటిక్ సీన్స్ కూడా అనవసరం అనిపిస్తుంది. అలాగే కొన్ని చోట్ల సినిమాలో లాజిక్స్ మిస్ అయ్యినట్టు అనిపిస్తుంది. అలాగే సినిమాకి ఒక డీసెంట్ ఎండింగ్ ఇచ్చారు అనుకునే సమయంలో దానికి అదనంగా సాగించే మరో స్టోరీ అనవసరం అనిపిస్తుంది.

అలాగే సినిమా ఫస్టాఫ్ సెకండాఫ్ లో కూడా రెండు పాటలు అనవసరం అనిపిస్తుంది. ఉన్నదే తక్కువ రన్ టైం అయినప్పటికీ ఇందులో కూడా ఇలాంటి అంశాలు బాగా బోర్ కలిగిస్తాయి. ఇంకా ఈ సినిమా సెకండాఫ్ చూస్తున్నంతసేపు అక్కడక్కడా సముద్రఖని “బ్రో” సినిమా గుర్తకురావచ్చు.

 

సాంకేతిక వర్గం:

ఈ సినిమాలో నిర్మాణ విలువలు పర్వాలేదు. ఉన్నంతలో మంచి విజువల్స్ ని అందించే ప్రయత్నం చేశారు. మెయిన్ గా విఎఫ్ఎక్స్ వర్క్ ఇలాంటి చిన్న సినిమాల వరకు ఇంప్రెసివ్ అని చెప్పొచ్చు. కాకపోతే ఇంకొంచెం నాచురల్ గా ఉంటే బాగుండేది. అలాగే సంగీతం పర్వాలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎడిటింగ్ లో పాటలు తీసెయ్యాల్సింది. అవి సినిమా ఫ్లోలో అవసరం లేదు.

ఇక దర్శకుడు శివ శేషు విషయానికి వస్తే.. తాను ఈ సినిమాకి ఇంట్రెస్టింగ్ లైన్ ని తీసుకున్నాడు. అలాగే సెకండాఫ్ లో తన డైరెక్షన్ బాగుంది. ఇంట్రెస్టింగ్ గా మంచి ట్విస్ట్ లు, థ్రిల్స్ తో స్క్రీన్ ప్లే ని బాగా మైంటైన్ చేసాడు. కానీ ఇదే ఫ్లో ఫస్టాఫ్ లో మిస్ అయ్యింది. తాను కథను డిఫరెంట్ చెప్పే ప్రయత్నం చేసాడో అదే రీతిలో కొన్ని చోట్ల చాలా రెగ్యులర్ కథనాన్ని నడిపించాడు. ఇది బాగా డిజప్పాయింట్ చేస్తుంది. అలాగే క్లైమాక్స్ లో ప్రిన్స్ స్టోరీ వరకు ఆపేసి ఉంటే బాగుండు అనిపిస్తుంది. సో ఇలా తన వర్క్ కొంచెం ఓకే అనిపిస్తుంది.

 

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “కలి” సినిమాలో పాయింట్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అలాగే ప్రిన్స్ మరియు నరేష్ అగస్త్యలు సాలిడ్ పెర్ఫామెన్స్ లు అందించారు. ఇంకా సెకండాఫ్ లో మంచి థ్రిల్ మూమెంట్స్ కూడా బాగానే ఉన్నాయి. కానీ ఇదే రీతిలో సినిమా ఫస్టాఫ్ కూడా ఉండుంటే ఇంకా బెటర్ గా ఉండేది. వీటితో సినిమా కొన్ని చోట్ల వరకు బోర్ అనిపించినా కొన్ని చోట్ల మాత్రం మంచి థ్రిల్స్ అందిస్తుంది.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

సంబంధిత సమాచారం

తాజా వార్తలు