అక్టోబర్ 4న రిలీజ్‌కు రెడీ అయిన ‘కలి’

అక్టోబర్ 4న రిలీజ్‌కు రెడీ అయిన ‘కలి’

Published on Sep 16, 2024 6:01 PM IST

యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య లీడ్ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం “కలి”. ఈ సినిమాను ప్రముఖ కధా రచయిత కె.రా‌ఘవేంద్ర రెడ్డి సమర్పణలో “రుద్ర క్రియేషన్స్” సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాకు శివ శేషు రచనతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఈ సినిమాను అక్టోబర్ 4న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు.

కలి పాత్ర చుట్టూ అల్లుకున్న ఈ కొత్త కథాంశం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని మూవీ టీమ్ చెబుతున్నారు. ఈ సినిమాలోని విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని.. యాక్షన్ సీన్స్ వారిని అలరిస్తాయని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అవుతుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు