‘కళింగ’ హిట్ పై హీరో ధృవ వాయు కామెంట్స్

‘కళింగ’ హిట్ పై హీరో ధృవ వాయు కామెంట్స్

Published on Sep 15, 2024 10:30 AM IST

టాలీవుడ్ లో ‘కిరోసిన్’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ధృవ వాయు నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ చిత్రమే ‘కళింగ. దర్శకుడిగా, హీరోగా కళింగ సినిమాతో అందరినీ ఆకట్టుకున్నారు. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 13న విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో..

హీరో, దర్శకుడు ధృవ వాయు మాట్లాడుతూ..‘ఇప్పుడున్న పరిస్థితుల్లో నాలాంటి ఓ కొత్త వ్యక్తి వచ్చి సినిమాను తీయడం.. హిట్టు కొట్టడం.. హౌస్ ఫుల్స్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. మీడియా సపోర్ట్ వల్లే మా సినిమా ఇంత వరకు వచ్చింది. వారి సహకారం వల్లే ఇంత పెద్ద హిట్ అయింది. వర్డ్‌ ఆఫ మౌత్ తో మా సినిమా అందరికీ మరింత చేరువ అవుతోంది. మా సినిమాను ఇంత ఇష్టపడుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. మా చిత్రంలోని విజువల్స్, అమ్మవారిని చూపించిన తీరు ఇలా ప్రతీ ఒక్క అంశం గురించి ఆడియెన్స్ మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా చిత్రాన్ని ఇంత బాగా ఆదరిస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్. కంటెంట్ ఉంటే సినిమాను హిట్ చేస్తామని మరోసారి తెలుగు ఆడియెన్స్ నిరూపించారు. మా చిత్రాన్ని ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియెన్స్‌కు థాంక్స్’ అని తెలిపాడు.

అలాగే నిర్మాత దీప్తి కొండవీటి మాట్లాడుతూ..‘మా డైరెక్టర్ ఈ సినిమా మీద ముందు నుంచీ ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఆయన నమ్మకమే ఈ సినిమాను ఇక్కడి వరకు తీసుకు వచ్చింది. ఆయన వల్లే ఈ చిత్రం ఇంత గొప్పగా వచ్చింది. టెక్నికల్‌గా మూవీ అద్భుతంగా వచ్చిందని అందరూ ప్రశంసిస్తున్నారు. మా సినిమాకు ఇంత మంచి విజయాన్ని అందించిన ఆడియెన్స్‌కు థాంక్స్’ అని అన్నారు.

మరో నిర్మాత పృథ్వీ యాదవ్ మాట్లాడుతూ..* ‘కళింగ సినిమాను ఇంత బాగా ఆధరిస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్. మా సినిమాను ఇంత బాగా ముందుకు తీసుకు వెళ్తున్న మీడియాకు థాంక్స్’ అని అన్నారు.

హీరోయిన్ ప్రగ్యా నయన్ మాట్లాడుతూ..‘నన్ను ప్రేక్షకులంతా కూడా పద్దు అనే పిలుస్తున్నారు. నా పాత్రకు ఇంత మంచి రెస్పాన్స్ వచ్చినందుకు ఆనందంగా ఉంది. గత మూడేళ్లుగా ఈ చిత్రం కోసం పని చేశాను. ఈ రోజు ఈ సక్సెస్ చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా దర్శక, నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు