సమీక్ష : ‘కళింగ’ – రొటీన్ సస్పెన్స్ థ్రిల్ల‌ర్ !

సమీక్ష : ‘కళింగ’ – రొటీన్ సస్పెన్స్ థ్రిల్ల‌ర్ !

Published on Sep 13, 2024 8:00 AM IST
Kalinga Movie Review in Telugu

విడుదల తేదీ : సెప్టెంబర్ 13, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: ధృవ వాయు, ప్రగ్యా నయన్, ఆడుకాలం నరేన్, తనికెళ్ల భరణి, మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, ప్రీతి సుందర్ కుమార్ తదితరులు.

దర్శకుడు: ధృవ వాయు

నిర్మాతలు : దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్

సంగీత దర్శకుడు: విష్ణు శేఖర, అనంత నారాయణన్ AG

సినిమాటోగ్రఫీ: అక్షయ్ రామ్ పొడిశెట్టి

సంబంధిత లింక్స్: ట్రైలర్

ధృవ వాయు హీరోగా మరియు దర్శకుడిగా తీసిన సినిమా ‘కళింగ’. దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ ఈ సినిమాని నిర్మించారు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

లింగ (ధృవ వాయు) ఒక అనాథగా పెరిగినా, ఊర్లో అందరితో మంచిగా ఉంటాడు. మరోవైపు సారా కాస్తూ లైఫ్ లీడ్ చేస్తుంటాడు. ఐతే, ఆ ఊరి పెద్ద (ఆడుకాలమ్ నరేన్), అతని తమ్ముడు బలి (బలగం సంజయ్) ఆ గ్రామాన్ని, అక్కడి ప్రజలను తమ గుప్పిట్లో పెట్టుకుని దారుణాలు చేస్తుంటారు. మరోవైపు అసుర భక్షి అనే దుష్ట శక్తి అమాయక ప్రజలను చంపి తింటూ ఉంటుంది. అసలు ఆ అసుర భక్షి ఏమిటి ?, దాని కథ ఏమిటి ?, ఈ మధ్యలో లింగ తన చిన్నతనం నుంచే పద్దు (ప్రగ్యా నయన్) ను ప్రేమిస్తూ ఉంటాడు. పద్దు కూడా లింకను ప్రేమిస్తుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం.. ఆ అసుర భక్షి ఉన్న సంస్థానానికి లింగ వెళ్లాల్సి వస్తోంది. ఆ సంస్థానానికి వెళ్లిన వాళ్లు మళ్లీ తిరిగి రారు ?, ఇంతకీ, ఆ ప్రదేశానికి ఉన్న శాపం ఏంటి ?, అక్కడికి వెళ్తే ఎందుకు తిరిగి రారు ?, మరి లింగ పరిస్థితి ఏమిటి ?, చివరకు ఆ అసుర భక్షిని లింగ అంతం చేశాడా ? లేదా ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్.. విజువల్స్ అండ్ మెయిన్ థీమ్. అలాగే, ధృవ వాయు డిజైన్ చేసుకున్న కొన్ని సీక్వెన్సెస్ బాగున్నాయి. నటీనటుల విషయానికి వస్తే.. హీరోగా కూడా నటించిన ధృవ వాయు బాగానే నటించాడు. లింగ పాత్రలో కనిపించిన ధృవ కొన్ని థ్రిల్లర్ సన్నివేశాల్లో తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో అలాగే ప్రీ క్లైమాక్స్ లో వచ్చే కీలక సీన్స్ లో కూడా ధృవ వాయు మెప్పించాడు.

ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రగ్యా నయన్ కూడా తన నటనతో ఆకట్టుకుంది. కొన్ని ప్రేమ సన్నివేశాల్లో ఆమె తన పెర్ఫార్మెన్స్ తో మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన ఆడుకాలం నరేన్ చాలా బాగా నటించారు. అలాగే బలి, తనికెళ్ల భరణి, మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, ప్రీతి సుందర్ కుమార్ మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలతో మెప్పించారు. దర్శకుడిగా ధృవ వాయు కథలో ఉన్న సస్పెన్స్ ని కొన్ని చోట్ల బాగా మెయింటైన్ చేశాడు. అతని టేకింగ్ కూడా బాగుంది.

 

మైనస్ పాయింట్స్ :

ఈ కళింగ సినిమాలో మెయిన్ పాయింట్ అండ్ కొన్ని సీన్స్ ఆకట్టుకున్నా… మధ్యలోని కొన్ని సీన్స్ మాత్రం బోర్ గా సాగుతాయి. అలాగే క్యారెక్టర్స్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూస్ ను ఎలివేట్ చేస్తూ దర్శకుడు అనుకున్న సీన్స్.. కొన్ని చోట్ల బెటర్ గా ఉన్నా… కొన్ని సన్నివేశాలు మాత్రం ఆసక్తికరంగా సాగలేదు.

పైగా అసుర భక్షి అనే దుష్టశక్తి ట్రాక్ లో లాజిక్ మిస్ అవ్వడం, చివరివరకూ ఆ ట్రాక్ ను మరియు అవే హైడింగ్ షాట్స్ ను సస్టైన్ చేస్తూ లాగడం వంటి అంశాలు బాగాలేదు. ఇలాంటి సస్పెన్స్ అండ్ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ లో వచ్చే ట్రీట్మెంట్.. స్క్రీన్ ప్లే పై ఇంట్రెస్ట్ ను పెంచుతూ పోవాలి. అలాగే, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎఫెక్టివ్ గా వర్కౌట్ అవ్వాలి. కానీ ఈ సినిమాలో కొన్నిచోట్ల అవి మిస్ అయ్యాయి.

నిజానికి దర్శకుడు సెకెండాఫ్ ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఇంట్రెస్ట్ గా నడుపుదామని మంచి ప్రయత్నం చేశారు, కాకపోతే, అది స్క్రీన్ మీద పూర్తి స్థాయిలో వర్కౌట్ కాలేదు.

 

సాంకేతిక విభాగం :

టెక్నికల్ గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. విష్ణు శేఖర, అనంత నారాయణన్ AG సంగీతం సినిమాకు ప్లస్ అయింది. అదే విధంగా సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి హైలైట్ గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ అక్షయ్ రామ్ పొడిశెట్టి పనితనం చాలా బాగుంది. ఎడిటర్ వర్క్ సినిమాకి తగ్గట్టు ఉంది. సినిమాలోని నిర్మాతలు దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక దర్శకుడు ధృవ వాయు వైవిధ్యమైన కథాంశంతో పాటు విభిన్నమైన పాత్రలను డిజైన్ చేసుకున్నా.. ఉత్కంఠభరితమైన కథనాన్ని మాత్రం రాసుకోలేదు.

 

తీర్పు :

‘కళింగ’ అంటూ వచ్చిన ఈ వైవిధ్యమైన సస్పెన్స్ థ్రిల్లర్ లో.. మెయిన్ థీమ్, విజువల్స్, సస్పెన్స్ తో సాగే కొన్ని యాక్షన్ ఎలిమెంట్స్ బాగున్నాయి. అయితే, ఇంట్రెస్టింగ్ గా సాగని ట్రీట్మెంట్ తో పాటు మెయిన్ క్యారెక్టరైజేషన్స్ బలహీనంగా సాగడం మరియు స్లో నేరేషన్ వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. ఓవరాల్ గా ఈ చిత్రంలో మెయిన్ థీమ్, యాక్షన్ ఎలిమెంట్స్ మాత్రమే కనెక్ట్ అవుతాయి.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

సంబంధిత సమాచారం

తాజా వార్తలు