ఆర్ఆర్ఆర్ రికార్డును బ్రేక్ చేసిన ‘క‌ల్కి 2898 AD’..ఎక్క‌డంటే?

ఆర్ఆర్ఆర్ రికార్డును బ్రేక్ చేసిన ‘క‌ల్కి 2898 AD’..ఎక్క‌డంటే?

Published on Jul 22, 2024 5:13 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన లేటెస్ట్ సెన్సేష‌న్ ‘క‌ల్కి 2898 AD’ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర త‌న దూకుడు కొన‌సాగిస్తూనే ఉంది. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ మైథాల‌జీ సైఫై స‌బ్జెక్టుతో తెర‌కెక్కించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాలో ప్ర‌భాస్ అదిరిపోయే ప‌ర్ఫార్మెన్స్ ఇవ్వ‌డంతో క‌ల్కి మూవీకి రిపీటెడ్ ఆడియెన్స్ వ‌స్తున్నారు.

ఈ సినిమా వ‌సూళ్ల ప‌రంగా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర త‌న స‌త్తా చాటుతూనే ఉంది. ఇప్ప‌టికే ఈ సినిమా వెయ్యి కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌తో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ప‌లు రికార్డుల‌ను బ్రేక్ చేసింది. తాజాగా ఈ సినిమా ఆర్ఆర్ఆర్ రికార్డును సైతం బ్రేక్ చేసి అంద‌రి దృష్టిని ఆక‌ట్టుకుంది. హిందీ బెల్ట్ లో క‌ల్కి ఇప్ప‌టివ‌ర‌కు ఏకంగా రూ.277 కోట్ల మేర వ‌సూళ్లు సాధించింది.

బాలీవుడ్ లో అత్య‌ధిక వ‌సూళ్లు రాబ‌ట్టిన సౌత్ సినిమాల్లో రూ.275 కోట్లతో మూడో ప్లేస్ లో ఉన్న‌ ఆర్ఆర్ఆర్ రికార్డును కల్కి క్రాస్ చేయ‌డం విశేషం. దీంతో ఆర్ఆర్ఆర్ 4వ స్థానానికి ప‌డిపోయింది. ఏదేమైనా క‌ల్కి రికార్డుల వేట ఇంకా ఆగ‌క‌పోవ‌డంతో, మున్ముందు ఈ సినిమా మ‌రిన్ని రికార్డులు క్రియేట్ చేయ‌డం ఖాయ‌మ‌ని సినీ ఎక్స్ ప‌ర్ట్స్ అంటున్నారు. ఇక క‌ల్కి 2898 AD మూవీలో అమితాబ్ బ‌చ్చ‌న్, క‌మ‌ల్ హాస‌న్, దీపిక ప‌దుకొనె, దిశా ప‌టాని ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్ ఈ సినిమాను భారీ బ‌డ్జెట్ తో ప్రొడ్యూస్ చేయ‌గా, సంతోష్ నారాయ‌ణ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందించారు..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు