క‌ల్కి ర్యాంపేజ్.. 11 రోజుల వ‌సూళ్లు ఇవే!


ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోన్న ప్రెస్టీజియస్ మూవీ ‘క‌ల్కి 2898 AD’ క‌ళ్లు చెదిరే వ‌సూళ్ల‌ను రాబ‌డుతూ త‌న దూకుడును ఏమాత్రం త‌గ్గించ‌డం లేదు. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన ఈ సెన్సేష‌న‌ల్ మూవీని ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ విజువ‌ల్ వండ‌ర్ గా తీర్చిదిద్దాడు. ఇక ఈ సినిమాలోని కంటెంట్ ప్రేక్ష‌కుల‌ను థ్రిల్ చేయ‌డంతో ఈ మూవీ స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేస్తూ వెళ్తోంది.

‘క‌ల్కి’ చిత్రం రిలీజ్ అయ్యి 11 రోజులు పూర్త‌యింది. కాగా, ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏకంగా రూ.950 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్లు సాధించి, వెయ్యి కోట్ల మార్క్ పై క‌న్నేసింది. ఇంత త‌క్కువ టైమ్ లో వెయ్యి కోట్ల మార్క్ ను రీచ్ కావ‌డంతో క‌ల్కి మూవీకి ప్రేక్ష‌కులు స‌లాం కొడుతున్నారు.

ఇక ఈ సినిమా రాబోయే రోజుల్లో ఎలాంటి వండ‌ర్స్ క్రియేట్ చేస్తుందా అని అభిమానులు ఆస‌క్తిగా చూస్తున్నారు. అమితాబ్ బచ్చ‌న్, క‌మ‌ల్ హాస‌న్, దీపిక ప‌దుకొనె, దిశా ప‌టాని త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాకు సంతోష్ నారాయ‌ణ‌న్ సంగీతం అందించారు. ఈ సినిమాను సి.అశ్వినీ ద‌త్ అత్యంత భారీ బ‌డ్జెట్ తో ప్రొడ్యూస్ చేశారు.

Exit mobile version