‘కల్కి’ కారణంగా ట్రెండింగ్‌‌ లోకి ఓల్డ్ టెంపుల్

ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా ప్రస్తుతం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అయితే, ఈ సినిమాలో నెల్లూరు జిల్లాలోని పెరుమాళ్లపాడు గ్రామంలో ఉన్న అతి పురాతన ఆలయాన్ని కూడా చూపించారు. శతాబ్దాల క్రితం పెన్నా నది ఒడ్డున పరశురాముడు స్వయంగా ప్రతిష్టించిన నాగమల్లేశ్వర స్వామి ఆలయం ఇదే అని ప్రచారంలో ఉంది. ఈ చిత్రంలో అశ్వత్థామగా కనిపించిన అమితాబ్‌ బచ్చన్ తలదాచుకున్న సీన్‌ ఈ ఆలయంలోనే తీశారు.

దీంతో, ఇప్పుడు ఈ ఆలయం హాట్‌ టాపిక్‌గా మారింది. కల్కి సినిమా విజయంతో ఇప్పుడు ఈ గుడికి బాగా తాకిడి పెరిగిందట. వందల ఏళ్ల తరబడి పూజలకు నోచుకోని ఈ ఆలయం.. మొత్తానికి కల్కి మూవీ దెబ్బకు మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చింది. పైగా అమితాబ్‌ ఎంట్రీ ఇక్కడేనంటూ ప్రతిఒక్కరూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ‘కల్కి 2898 ఏడీ’ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. భారతీయ సినీ పరిశ్రమలోనే భారీ సినిమాగా ఈ చిత్రం నిలిచింది.

Exit mobile version