ఆ మల్టిప్లెక్స్ లో “కల్కి” రికార్డ్ షోస్ ఫుల్స్ తో సెన్సేషన్


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “కల్కి 2898 ఎడి” కోసం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. మరి టోటల్ ఇండియా వైడ్ గా కూడా కల్కి సినిమా సాలిడ్ బుకింగ్స్ ని నమోదు చేస్తుండగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి బుకింగ్స్ ఈ చిత్రానికి నమోదు అవుతున్నాయి.

ఇక ఇదిలా ఉండగా హైదరాబాద్ సిటీలో అయితే కల్కి కి భారీ డిమాండ్ నెలకొంది. మొదటి రోజు టికెట్ ధరలు ఎక్కువ ఉన్నప్పటికీ మల్టీప్లెక్స్ లలో కల్కి ని చూసేందుకు ఆడియెన్స్ ఒక ఊహించని రెస్పాన్స్ ని అందిస్తున్నారు. అలా హైదరాబాద్ లో రీసెంట్ గా ఓపెన్ చేసిన అపర్ణ సినిమాస్ అనే మల్టీప్లెక్స్ లో మొదటి రోజు ఏకంగా 47 షోలని రిలీజ్ డేట్ కి ప్లాన్ చేస్తే అనూహ్యంగా ఈ 47 షోలు కూడా ఫిల్ అయిపోయి హౌస్ ఫుల్స్ పడ్డాయి.

దీనితో వారి దగ్గర కల్కి రికార్డు షోస్ ని మొత్తం హౌస్ ఫుల్స్ పడడం మొదటిసారి అన్నట్టు తెలుస్తుంది. దీనితో ఆడియెన్స్ లో కల్కి పట్ల ఉన్న ఆసక్తి ఏ స్థాయిలో ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రంలో కమల్ హాసన్ (Kamal Haasan), దీపికా (Deepika Padukone), అమితాబ్ సహా దిశా పటాని తదితరులు నటిస్తుండగా సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే వైజయంతి మూవీస్ నిర్మాణం వహించారు.

Exit mobile version