ఒక్క రోజు బుకింగ్స్ లో హిస్టరీ క్రియేట్ చేసిన “కల్కి 2998 ఎడి”


ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతున్న భారీ చిత్రం “కల్కి 2898 ఎడి” కోసం అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ అవైటెడ్ సినిమాలో యూనివర్సల్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan), అమితాబ్ బచ్చన్ (Amitab Bachchan) ఇంకా నటి దీపికా పడుకోన్ లు ముఖ్య పాత్రల్లో నటించారు.

అయితే ఈ సినిమాని ఇండియా వైడ్ సెన్సేషనల్ క్రేజ్ నెలకొనగా ఈ క్రేజ్ తో అయితే ఇండియా వైడ్ భారీ భారీ బుకింగ్స్ ని ప్రీ సేల్స్ నుంచే ఈ చిత్రానికి వచ్చాయి. అలా ఇప్పుడు సినిమా బుకింగ్స్ విషయంలో ఇండియన్ సినిమా దగ్గర ఏ సినిమా కూడా అందుకోని అరుదైన రికార్డు కొట్టినట్టుగా తెలుస్తుంది.

గడిచిన 24 గంటల్లో కల్కి సినిమాకి బుక్ మై షో లో ఏకంగా 1.28 మిలియన్ టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇదొక సంచలనం అని చెప్పాలి. ఒక్క రోజులో 12 లక్షలకి పైగా బుకింగ్స్ ఒక సినిమాకి జరగడం అనేది ఇప్పటివరకు జరగలేదు. మొదటిసారి కల్కి కి జరగడం హిస్టరీగా మారింది. మరి మున్ముందు కల్కి ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి.

Exit mobile version