ప్రీ సేల్స్ లో “కల్కి” ఖాతాలో మరో రికార్డు

ప్రీ సేల్స్ లో “కల్కి” ఖాతాలో మరో రికార్డు

Published on Jun 22, 2024 3:20 PM IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పడుకోణ్, దిశా పటాని అలాగే అమితాబ్, కమల్ హాసన్ లాంటి దిగ్గజాలు నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “కల్కి 2898 ఎడి”. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్త ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా జస్ట్ మరికొన్ని రోజుల్లో సినిమా థియేటర్స్ లో పడబోతోంది. ఇక ఇదిలా ఉండగా యూఎస్ మార్కెట్ లో సినిమా బుకింగ్స్ ఆల్రెడీ మొదలైన సంగతి తెలిసిందే.

అక్కడ మాత్రం కల్కి కి నెవర్ బిఫోర్ రెస్పాన్స్ వస్తుంది అని చెప్పాలి. లాస్ట్ టైం సలార్ తోనే సెన్సేషన్ ని సెట్ చేసిన ప్రభాస్, ఇప్పుడు కల్కి తో వాటిని బద్దలు కొడుతున్నాడు. మరి నార్త్ అమెరికా మొత్తంలో కల్కి ఇపుడు ఏకంగా 2.5 మిలియన్ డాలర్స్ గ్రాస్ ని క్రాస్ చేసి మరో ఫాస్టెస్ట్ రికార్డు ని సొంతం చేసుకుంది. ఇదే ఫ్లో లో అయితే డెఫినెట్ గా రిలీజ్ నాటికి ఈ చిత్రం సునాయాసంగా 3 మిలియన్ మార్క్ ని కేవలం ప్రీ సేల్స్ లోనే దాటేస్తుంది అని చెప్పడంలో సందేహమే లేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు