నైజాంలో “కల్కి” డే 2 కూడా సాలిడ్ వసూళ్లు

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పడుకోణ్ అలాగే దిశా పటాని ఇంకా యూనివర్సల్ హీరో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజాల కలయికలో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన అవైటెడ్ భారీ చిత్రం “కల్కి 2898 ఎడి” కోసం తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం విడుదల అయ్యి వరల్డ్ వైడ్ గా రికార్డు ఓపెనింగ్స్ ని అందుకోగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రం రికార్డు వసూళ్లు మొదటి రోజు అందుకుంది.

మరి అలా నైజాం మార్కెట్ లో మొదటి రోజే ఈ చిత్రం 19.5 కోట్ల షేర్ తో ఆల్ టైం టాప్ 2 లో నిలవగా ఇప్పుడు రెండో రోజు కూడా సిల్డి నంబర్స్ ని నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. మరి పి ఆర్ నంబర్స్ ప్రకారం డే 2 కి గాను 10.02 కోట్ల షేర్ ని అందుకుందట. దీనితో ఈ రెండు రోజుల్లోనే కల్కి చిత్రం సుమారుగా 30 కోట్ల షేర్ మార్క్ ని టచ్ చేసేసింది అని చెప్పాలి. ఇది మాత్రం ఒక ఊహించని సెన్సేషన్ అనే చెప్పుకోవాలి. ఇక ఈ భారీ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహించారు.

Exit mobile version