“కల్కి” : ఈ విషయంలో నాగ్ అశ్విన్ కి స్పెషల్ అప్లాజ్

ప్రస్తుతం ఇండియా అంతా మారుమోగుతున్న సినిమా పేరు “కల్కి 2898 ఎడి”. దర్శకుడు నాగ్ అశ్విన్ అలాగే పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సెన్సేషనల్ చిత్రం ఇది కాగా ఎన్నో అంచనాలు నడుమ ఈ చిత్రం థియేటర్స్ లో నేడు విడుదల అయ్యింది.

అయితే ఈ సినిమా చూసిన తర్వాత అభిమానులు మూవీ లవర్స్ చాలా ఎగ్జైట్ అవుతున్నారు. అయితే ఈ అంతటికీ కారణం దర్శకుడు నాగ్ అశ్విన్ వర్క్ అనే చెప్పాలి. మెయిన్ గా తాను సెకండాఫ్ ని తీర్చిదిద్దిన విధానం థియేటర్స్ లో ఆడియెన్స్ ని కట్టి పడేసింది.

సాలిడ్ హై మూమెంట్స్, పీక్ ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్స్ తో సినిమా ముగింపుని ఓ రేంజ్ లో అందించాడు. దీనితో కల్కి చూసిన ఆడియెన్స్ అంతా కూడా ఈ సెకండాఫ్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ కోసం మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు. ఈ విషయంలో మాత్రం పాన్ ఇండియా ప్రేక్షకుల నుంచి ప్రముఖులు నుంచి నాగ్ అశ్విన్ కి స్పెషల్ అప్లాజ్ దక్కుతుంది.

Exit mobile version