యూఎస్ లో “కల్కి” డిస్ట్రిబ్యూటర్స్ తో “గబ్బర్ సింగ్” రీరిలీజ్

యూఎస్ లో “కల్కి” డిస్ట్రిబ్యూటర్స్ తో “గబ్బర్ సింగ్” రీరిలీజ్

Published on Aug 12, 2024 12:01 AM IST


టాలీవుడ్ పవర్ స్టార్ అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ హీరోగా ఇపుడు పలు చిత్రాలు చేస్తుండగా ఈ సినిమాల్తో పాటుగా తన నుంచి పలు రీ రిలీజ్ లు కూడా వస్తున్నా సంగతి తెలిసిందే. అలా ఈసారి పవన్ కళ్యాణ్ బర్త్ డే కానుకగా తన సెన్సేషనల్ కం బ్యాక్ హిట్ చిత్రం “గబ్బర్ సింగ్” రీ రిలీజ్ కి రాబోతుంది అయితే ఈ చిత్రాన్ని దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించగా 2012లో వచ్చిన చిత్రం సెన్సేషనల్ హిట్ అయ్యి పవన్ కళ్యాణ్ స్టార్ పవర్ ఏంటో చూపించింది.

అయితే ఈసారి మళ్ళీ రీ రిలీజ్ కి రాబోతుండగా సాలిడ్ ప్లానింగ్ లు దీనికి జరుగుతున్నాయి. అలా యూఎస్ లో కూడా ఈ సినిమాకి ఊహించని ప్లానింగ్ లే చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ గా ఈ చిత్రాన్ని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్ వారు డిస్ట్రిబ్యూట్ చేయనుండడం విశేషం.

మరి వీరే రీసెంట్ గా ప్రభాస్ నటించిన పాన్ ఇండియా హిట్ చిత్రం “కల్కి 2898 ఎడి” ని కూడా రిలీజ్ చేశారు. అలాగే పవన్ నుంచి రానున్న పాన్ ఇండియా చిత్రం “ఓజి” కూడా వీరి నుంచే రానుంది. మరి ఇలాంటి డిస్ట్రిబ్యూషన్ సంస్థ నుంచి గబ్బర్ సింగ్ లాంటి సినిమా రీ రిలీజ్ కావడం ఇంట్రెస్టింగ్ అంశం అని చెప్పాలి. మరి గబ్బర్ సింగ్ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు