“కల్కి” లో ప్రభాస్ పై ఆ సీన్ గూస్ బంప్స్ తెచ్చాయి.. ఫైట్ మాస్టర్ కామెంట్స్

“కల్కి” లో ప్రభాస్ పై ఆ సీన్ గూస్ బంప్స్ తెచ్చాయి.. ఫైట్ మాస్టర్ కామెంట్స్

Published on Jul 20, 2024 1:00 PM IST

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న మన తెలుగు సినిమా “కల్కి 2898 ఎడి” కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విజయవంతంగా నాల్గో వారంలోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పటికీ స్ట్రాంగ్ హెల్డ్ ని బుకింగ్స్ ని కనబరుస్తు భారీ లాంగ్ రన్ వైపుగా దూసుకెళ్తుంది. అయితే ఈ చిత్రం సంబంధించి మేకర్స్ ఒకో ఆర్టిస్ట్ తో ఇంట్రెస్టింగ్ వీడియో లను రిలీజ్ చేస్తూ మరిన్ని ఆసక్తి విషయాలు వెల్లడించారు.

అలా తాజాగా ఈ సినిమాకి ఫైట్ మాస్టర్ గా వర్క్ చేసిన సతీష్ పోలోజు నుంచి ఇంట్రెస్టింగ్ వీడియోని ఇపుడు వదిలారు. అయితే ఇందులో కల్కి యాక్షన్ సీన్స్ పై ఇంట్రస్టింగ్ విషయాలు తాను వెల్లడించారు. కల్కి లో ప్రభాస్ పై చక్రంని ఆపే సీన్ ఉంటుంది. నిజానికి ఆ చక్రం చాలా బరువు ఉంటుంది కానీ దానిని షూటింగ్ సమయంలో ప్రభాస్ గారు అలా ఆపడం చూసి నిజంగా అందరికీ గూస్ బంప్స్ వచ్చాయని తెలిపారు. అలాగే నటి దీపికా పడుకోణ్ ని తాళ్లతో కట్టి పైకి లేపి తీసుకెళ్లే సీక్వెన్స్ ఉంటుంది అలాంటి సీన్ తో ఆవిడ అద్భుతంగా చేసారని చెప్పుకొచ్చారు. దీనితో ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు