‘క‌ల్కి’ బ్రేక్ ఈవెన్ మార్క్ ఎంతో తెలుసా?

ప్రెస్టీజియ‌స్ పాన్ ఇండియా మూవీ ‘క‌ల్కి 2898 AD’ నేడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన తీరుకు ప్రేక్ష‌కులు ఫిదా అవుతున్నారు. కాగా, ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుండ‌టంతో ఇప్పుడు అంద‌రి చూపులు ఈ సినిమా వసూళ్ల‌పై ప‌డ్డాయి.

‘క‌ల్కి’ సినిమాను నిర్మాత సి.అశ్విని ద‌త్ రూ.600 కోట్ల బ‌డ్జెట్ తో ప్రొడ్యూస్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కు చేరుకోవాలంటే రూ.395 కోట్ల షేర్ వ‌సూళ్లు సాధించాలి. అంటే దాదాపు రూ.800 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు వ‌స్తే క‌ల్కి మూవీ హిట్ అయిన‌ట్లు. అయితే, ఈ సినిమాకు వ‌స్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఈ సినిమా ఈజీగా బ్రేక్ ఈవెన్ కు చేరుకుంటుంద‌ని సినీ ఎక్స్ ప‌ర్ట్స్ అంటున్నారు.

క‌ల్కి మూవీ రూ.1000 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను దాట‌డం ఖాయ‌మ‌ని వారు అంటున్నారు. అమితాబ్ బ‌చ్చ‌న్, క‌మ‌ల్ హాస‌న్, దీపిక పదుకొనె, దిశా ప‌టాని త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాకు సంతోష్ నారాయ‌ణ‌న్ సంగీతం అందించారు.

Exit mobile version