వంద కోట్ల మార్క్ క్రాస్ చేసిన‌ క‌ల్కి హిందీ వ‌ర్ష‌న్

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘క‌ల్కి 2898 AD’ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సాలిడ్ వ‌సూళ్ల‌తో దూసుకుపోతుంది. ఈ సినిమాను నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన తీరుకు ప్రేక్ష‌కులు ఫిదా అవుతున్నారు. ఇక ఈ సినిమాకు లాంగ్ వీకెండ్ బాగా క‌లిసొచ్చింది. కేవ‌లం సౌత్ లోనే కాకుండా, నార్త్ లోనూ ఈ సినిమా దుమ్ములేపుతోంది.

క‌ల్కి హిందీ వ‌ర్ష‌న్ లో రికార్డ్ క‌లెక్ష‌న్స్ రాబడుతోంది. కేవ‌లం నాలుగు రోజుల్లో ఈ సినిమా హిందీ వ‌ర్ష‌న్ లో ఏకంగా రూ.100 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన‌ట్లు లెక్క‌లు చెబుతున్నాయి. ఈ సినిమా గురువారం రోజున రూ.22.50 కోట్లు వ‌సూలు చేయ‌గా, శుక్ర‌వారం నాడు రూ.23.25 కోట్లు, శ‌నివారం నాడు రూ.26.25 కోట్లు, ఆదివారం రోజున రూ.40.15 కోట్ల‌తో వంద కోట్ల క్ల‌బ్ లోకి ఎంట‌ర్ అయ్యింది.

కేవ‌లం హిందీ వ‌ర్ష‌న్ లోనే క‌ల్కి రూ.100 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించ‌డంతో చిత్ర యూనిట్ సంతోషం వ్య‌క్తం చేస్తోంది. ఇక ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్ప‌టికే రూ.500 కోట్ల వ‌సూళ్ల‌తో ప్ర‌భంజ‌నం సృష్టించింది. మ‌రి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకా ఎలాంటి వ‌సూళ్ల‌ను రాబ‌డుతుందో చూడాలి. ఈ సినిమాలో అమితాబ్ బ‌చ్చ‌న్, క‌మ‌ల్ హాసన్, దీపిక ప‌దుకొనె, దిశా ప‌టాని వంటి భారీ క్యాస్టింగ్ న‌టించారు.

Exit mobile version