నార్త్ లో క‌ల్కి విశ్వ‌రూపం.. ఏకంగా 3వ ప్లేస్ లో చోటు

నార్త్ లో క‌ల్కి విశ్వ‌రూపం.. ఏకంగా 3వ ప్లేస్ లో చోటు

Published on Jun 27, 2024 7:00 AM IST

ప్రెస్టీజియ‌స్ పాన్ ఇండియా మూవీ క‌ల్కి 2898 AD నేడు థియేట‌ర్ల‌లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ పూర్తి సైన్స్ ఫిక్ష‌న్ మూవీగా తెర‌కెక్కించ‌గా, ప్ర‌భాస్ ఈ సినిమాలో అల్ట్రా స్టైలిష్ లుక్ లో క‌నిపిస్తున్నాడు. కాగా, ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లో దుమ్ములేపింది.

ముఖ్యంగా నార్త్ బెల్ట్ లో హిందీ వ‌ర్ష‌న్ లో క‌ల్కి మూవీ ఎవ‌రూ ఊహించ‌ని బుకింగ్స్ తో దూసుకెళ్లింది. పివిఆర్, ఐనాక్స్, సినిపోలిస్ వంటి మ‌ల్టిప్లెక్స్ థియేట‌ర్స్ లో ఏకంగా 1,25,000 టికెట్ల విక్ర‌యం జ‌రిగిన‌ట్లుగా తెలుస్తోంది. 2024లో ఇది అత్య‌ధిక టికెట్లు అమ్ముడైన చిత్రాల్లో టాప్-3 ప్లేస్ స్థానాన్ని ద‌క్కించుకుంది.

Mr. & Mrs. మ‌హి, ఫైట‌ర్ చిత్రాల త‌రువాత ఆర్టిక‌ల్ 370తో క‌లిసి క‌ల్కి ఈ 3వ ప్లేస్ లో నిలిచింది. నార్త్ బెల్ట్ లో క‌ల్కి మూవీ రూ.20-25 కోట్ల మేర ఓపెనింగ్ బిజినెస్ చేస్తుంద‌ని బిటౌన్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమాలో అమితాబ్ బచ్చ‌న్, క‌మల్ హాస‌న్, దీపిక ప‌దుకొనె, దిశా ప‌టాని త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు