ఓటీటీలో అప్పుడే నెంబర్ 1 ట్రెండింగ్ కి వచ్చేసిన “కల్కి 2898 ఎడి”

ఓటీటీలో అప్పుడే నెంబర్ 1 ట్రెండింగ్ కి వచ్చేసిన “కల్కి 2898 ఎడి”

Published on Aug 23, 2024 9:00 AM IST

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా అలాగే దిశా పటాని ఫీమేల్ లీడ్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా హిట్ చిత్రం “కల్కి 2898 ఎడి” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం సెన్సేషనల్ హిట్ అయ్యి రికార్డ్ వసూళ్లు అందుకుంది. అయితే ఈ చిత్రం థియేటర్స్ రిలీజ్ తర్వాత అంతా ఎదురు చూసింది ఓటీటీ ఎంట్రీ కోసమే..

మరి నిన్న అమెజాన్ ప్రైమ్ వీడియో అలాగే నెట్ ఫ్లిక్స్ లో పాని ఇండియా ఎంట్రీ ఇచ్చిన ఈ చిత్రం మరోసారి ఆడియెన్స్ మన్ననలు పొందుతుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా అప్పుడే ఓటీటీలో నెంబర్ 1 స్థానం లోకి ట్రెండింగ్ అవుతూ వచ్చేసింది. మరి ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో కాగా నిన్న స్ట్రీమింగ్ రావడంతోనే ఆల్ టైం టాప్ 5 నెంబర్ తో మొదలు కాగా ఇప్పుడు నెంబర్ 1 ప్లేస్ లోకి వచ్చేసి అదరగొడుతుంది. మొత్తానికి అయితే బిగ్ స్క్రీన్స్ తో పాటుగా ఓటీటీ లో కూడా కల్కి మేనియా ఇప్పుడు మామూలు లెవెల్లో లేదని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు