“కల్కి” ఆ లీక్ ఎవరు చేశారో ఇంకా వెతుకుతున్నాం..

“కల్కి” ఆ లీక్ ఎవరు చేశారో ఇంకా వెతుకుతున్నాం..

Published on Jul 21, 2024 8:00 AM IST

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఆదరగొడుతున్న భారీ చిత్రం “కల్కి 2898 ఎడి” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు నాగ్ అశ్విన్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్స్ అమితాబ్, దీపికా, దిశా పటాని అలాగే కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్ తో చేసిన ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఇప్పుడు రికార్డ్ వసూళ్లు అందుకొని అదరగొడుతుంది.

అయితే ఈ సినిమా నుంచి ఫస్ట్ టీజర్ ని మేకర్స్ వదిలినపుడు అందరిలో ఒకటే మాట మన తెలుగు సినిమా నుంచి ఇలాంటి ఒక సినిమాని ఊహించలేదు అనే.. ఆ రేంజ్ లో టీజర్ చూసి అంతా ఇంప్రెస్ అయ్యారు. అయితే ఆ టీజర్ మేము వదిలి నేటికి ఏడాది అయ్యింది అని మేకర్స్ వైజయంతి మూవీస్ వారి చెబుతున్నారు.

మరి ఈ ఏడాదికి కల్కి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది అని చెప్తున్నారు. కానీ అసలు తమకంటే ముందు ఆ టీజర్ ని ఎవరు లీక్ చేసారు అనేది ఇంకా తెలియరాలేదు అని వారు చెప్పారు. కల్కి విషయంలో వచ్చిన చాలా లీక్స్ లో అది కూడా ఒకటి. మరి ఆ లీక్ చేసినవారిని ఇంకా పట్టుకోకపోవడం గమనార్హం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు