జపాన్లో “కల్కి” మేనియా.. హ్యాపీ మూమెంట్స్ లో దర్శకుడు

జపాన్లో “కల్కి” మేనియా.. హ్యాపీ మూమెంట్స్ లో దర్శకుడు

Published on Dec 18, 2024 11:00 AM IST

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దిశా పటాని అలాగే దీపికా పడుకోణ్ ఫీమేల్ లీడ్స్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “కల్కి 2898 ఎడి” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం ఈ ఏడాది టాలీవుడ్ నుంచి సహా ఇండియా వైడ్ గా భారీ వసూళ్లు అందుకుంది. మరి ఈ సినిమాని ఇపుడు జపాన్ లో కూడా గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధం చేస్తుండగా ఇపుడు కల్కి 2898 ఎడి మేకర్స్ సాలిడ్ ప్రమోషన్స్ చేస్తున్నారు.

ఇలా మేకర్స్ ఓ హ్యాపీ మూమెంట్ ని దర్శకుడిపై పంచుకున్నారు. మామూలుగా జపాన్ లో ప్రభాస్ కి భారీ ఫ్యాన్స్ ఉన్నారు. మరి అక్కడ అభిమానులు ఈ సినిమా పట్ల చూపించిన ప్రేమ, గ్రీటింగ్ కార్డ్స్ తో నాగ్ అశ్విన్ ఛీర్స్ చెబుతూ కనిపిస్తున్నాడు. దీంతో కల్కి విషయంలో జపాన్ లో మంచి రెస్పాన్స్ ఖాయం అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు