స్టార్ట్ అయిన “కల్కి” మ్యానియా…థియేటర్ల వద్ద భారీగా ఫ్యాన్స్!

స్టార్ట్ అయిన “కల్కి” మ్యానియా…థియేటర్ల వద్ద భారీగా ఫ్యాన్స్!

Published on Jun 27, 2024 3:00 AM IST

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898AD. ఈ చిత్రం రిలీజ్ కి కేవలం కొద్ది గంటల సమయం మాత్రమే ఉండటంతో, అభిమానులు థియేటర్ల వద్దకు చేరుకుంటున్నారు. తన అభిమాన హీరో చిత్రాన్ని తొలి షో కి చూసేందుకు రెడీ అయిపోయారు. హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఇప్పటికే సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో బెన్ ఫిట్ షోలకు అనుమతి లభించడంతో తొందరగా థియేటర్ల వద్దకు చేరుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకునే, దిశా పటాని, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, శోభన, మాళవిక నాయర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి సంతోష్ నారాయణన్ అధ్బుతమైన సంగీతం అందించారు. ఈ చిత్రం ఓవర్సీస్ లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది. ప్రీ సేల్స్ తో ఇప్పటికే ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేయగా, డే1 వసూళ్లు అక్కడ మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు