‘క‌ల్కి’ టికెట్ రేట్ల పెంపు.. ఆ రోజే రానున్న క్లారిటీ..?

‘క‌ల్కి’ టికెట్ రేట్ల పెంపు.. ఆ రోజే రానున్న క్లారిటీ..?

Published on Jun 23, 2024 12:00 AM IST

సినిమా ల‌వ‌ర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘క‌ల్కి 2898 AD’ మూవీ మ‌రో 5 రోజుల్లో థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుంది. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ విజువ‌ల్ వండ‌ర్ మూవీని బిగ్ స్క్రీన్ పై చూసేందుకు ప్రేక్ష‌కులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. కాగా, ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్ష‌కులకు ఓ షాక్ ఇచ్చేందుకు సిద్ధ‌మైనట్లుగా తెలుస్తోంది.

‘క‌ల్కి’ చిత్రానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్ల పెంపును కోరుతూ చిత్ర యూనిట్ రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ద‌ర‌ఖాస్తు చేసింద‌ట‌. ఇటు తెలంగాణ‌తో పాటు ఏపీ ప్ర‌భుత్వం కూడా ఈ విష‌యంపై పాజిటివ్ గా రెస్పాన్స్ కానున్న‌ట్లు తెలుస్తోంది.

దీంతో ‘క‌ల్కి’ సినిమా టికెట్ రేట్లు ఏపీలో యూనిఫార‌మ్(మ‌ల్టీప్లెక్ & సింగిల్ స్క్రీన్) రూ.100 పెంపు కానుండ‌గా.. తెలంగాణ‌లో మల్టీప్లెక్స్ రూ.75, సింగిల్ స్క్రీన్ థియేటర్ రూ.100 మేర పెంచేందుకు అనుమ‌తులు రానున్నాయ‌ట‌. వీటితో పాటు బెనిఫిట్ షోల‌కు కూడా రెండు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు అనుమ‌తిని ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అయితే సోమ‌వారం రోజున దీనికి సంబంధించిన జీవో వెలువ‌డే అవ‌కాశం ఉన్న‌ట్లుగా సినీ వ‌ర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు