పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మైథాలజి, సైఫై మూవీ ప్రేక్షకులను థ్రిల్ చేసింది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూసిన ప్రేక్షకుల కోసం ఈ సినిమా నేడు ఓటీటీ ప్లాట్‌ఫాంలో ల్యాండ్ అయ్యింది. అయితే, ఈ సినిమాను ఓటీటీలో చూసిన అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ వారు ఎందుకు అలా ఫీల్ అవుతున్నారో తెలుసా?
‘కల్కి 2898 AD’ మూవీ ఒరిజినల్ వర్షన్ రన్ టైమ్ గమనిస్తే 3 గంటల 1 నిమిషం. కానీ, ఓటీటీలో దీని రన్ టైమ్ 2 గంటల 55 నిమిషాలుగా ఉంది. అంటే, సినిమాను 6 నిమిషాలు ట్రిమ్ చేశారు. ‘కల్కి 2898 AD’ సినిమాలోని కొన్ని సీన్స్‌ను ట్రిమ్ చేయడంతో పాటు కొంతమేర మార్పులు కూడా చేశారు. మరి ఆ ట్రిమ్ చేసిన సీన్స్, మార్పులు ఏమిటనేవి ఇక్కడ చూద్దాం.
ప్రభాస్ ఎంట్రీ సీన్‌ను ట్రిమ్ చేశారు. ఓ వృద్ధురాలు, విలన్ గ్యాంగ్‌లోని ఓ వ్యక్తి ప్రభాస్‌ని కప్ప అంటూ కామెంట్ చేసే సీన్‌ను కట్ చేశారు. ఇంట్రొడక్షన్ ఫైట్‌లో కొంతమేర సీన్‌ను ట్రిమ్ చేశారు. ‘టా టక్కర’ సాంగ్‌లోని బీచ్ సీన్స్‌ను ట్రిమ్ చేశారు. అంతేగాక, కాంప్లెక్స్ నుంచి ఆయనను బయటకు గెంటేసే సీన్స్ కూడా కట్ చేశారు. ఇంటర్వెల్ సీన్‌లో దీపిక మంటల్లో నుంచి నడుచుకుంటూ వస్తున్న సీన్‌లో కొత్త లిరిక్స్ యాడ్ చేశారు. ఇంటర్వెల్ కార్డును పూర్తిగా తొలగించారు. ఇలా ‘కల్కి 2898 AD’ సినిమా ఓటీటీ వర్షన్‌లో పలు సీన్స్‌ను ట్రిమ్ చేయడంతో ఆడియెన్స్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.