డిప్యూటీ సీఎం పవన్ తో మీటింగ్.. ఆ అపోహలపై ‘కల్కి’ నిర్మాత క్లారిటీ

టాలీవుడ్ ప్రముఖ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇపుడు హీరోగానే కాకుండా ఆంధ్ర ప్రదేశ్ లో ఉప ముఖ్యమంత్రి సహా ఎమ్మెల్యే అని కూడా అందరికీ తెలిసిందే. అయితే ఇండస్ట్రీ నుంచి ఓ టాప్ మోస్ట్ హీరో ఉన్నత పదవిలో కూడా ఉండడం ఇండస్ట్రీ బాగుకు కూడా ఎంతో దోహదపడుతుంది అని ఇటీవల టాలీవుడ్ టాప్ నిర్మాతలు అంతా పవన్ ని కలవడం జరిగింది.

అయితే ఈ మీటింగ్ లో లేటెస్ట్ పాన్ ఇండియా సెన్సేషన్ “కల్కి 2898 ఎడి” దిగ్గజ నిర్మాత చలసాని అశ్వినీదత్ కూడా పాల్గొన్నారు. అయితే ఈ మీటింగ్ లో పవన్ సినిమా టికెట్ రేట్లను వెయ్యి, పదిహేనొందలు పెంచుకోండి అన్నట్టుగా చెప్పారని అశ్వినీదత్ చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ గా మారాయి. అయితే ఈ స్టేట్మెంట్ తో అందరిలో భిన్నాభిప్రాయాలు రేకెత్తగా అసలు ఈ స్టేట్మెంట్ పై తాజాగా అశ్వినీదత్ అఫీషియల్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.

“ఇటీవల నేను ఇచ్చిన ఇంటర్వ్యూ లో టికెట్ రేట్ల పెంపుదల గురించి అనవసరపు అపోహలకు వస్తున్నాయి. ‘సినిమా టికెట్ల రేట్ల పెంపుదల కోసం ప్రతీసారీ ప్రభుత్వం చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఓ శాశ్వతమైన ప్రతిపాదన చేయాలన్నది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి అభిలాష. నిర్మాతలంతా కూర్చుని, కూలంకుషంగా చర్చించుకొని, సినిమా బడ్జెట్ను బట్టి టికెట్ రేట్లు ఎంత వరకూ పెంచుకోవొచ్చు, అది ఒక వారమా? 10 రోజులా ? అనే విషయంపై నిర్మాతలు ఒక నిర్ణయానికి వస్తే, గౌరవ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు గారు “తాను స్వయంగా చర్చిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అన్ని వర్గాల వారికి, ప్రేక్షకులకి ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని కలిసికట్టుగా తీసుకొందామని పవన్ కళ్యాణ్ సూచించారు. ఆయన నిర్మాతలందరికీ అండగా ఉంటానని మాట ఇచ్చారు”. వారి నడుమ జరిగిన చర్చలో సారాంశం కాగా తాను చెప్పిన మాటలు మరో విధంగా ప్రొజెక్ట్ కావడంతో తాను వెంటనే స్పందించి ఈ క్లారిటీ అందించారు.

Exit mobile version