క‌ల్కి 2898 AD ఘ‌న విజ‌యం సంతోషాన్నిచ్చింది – సి.అశ్వినీద‌త్

క‌ల్కి 2898 AD ఘ‌న విజ‌యం సంతోషాన్నిచ్చింది – సి.అశ్వినీద‌త్

Published on Jun 29, 2024 7:32 PM IST

ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన సైన్స్ ఫిక్ష‌న్ మూవీ క‌ల్కి 2898 AD బాక్సాఫీస్ ద‌గ్గ‌ర విజ‌య‌వంతంగా ర‌న్ అవుతోంది. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా న‌టించ‌గా భారీ క్యాస్టింగ్ ఈ చిత్రంలో క‌నిపించారు. ఎపిక్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా ఈ సినిమా నిల‌వ‌డం, భారీ వ‌సూళ్ల‌ను రాబ‌డుతుండ‌టంతో చిత్ర నిర్మాత సి.అశ్వినీద‌త్ విలేకరుల సమావేశంలో ‘కల్కి 2898 AD’ విశేషాలను పంచుకున్నారు.

క‌ల్కి 2898 AD మీ అంచ‌నాల‌ను అందుకుందా..?

సినిమా రిలీజ్ అయిన మార్నింగ్ షో నుంచే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ రిపోర్ట్ లు వచ్చాయి. నేను ఏదైతే అనుకున్నానో అలాంటి అఖండ విజయం వచ్చింది. హ్యాట్సాఫ్ టు నాగ్ అశ్విన్. నేను చాలా సంతోషంగా ఉన్నాను.

నాగ్ అశ్విన్ ఇలాంటి సబ్జెక్ట్ ని ఎలా హ్యాండిల్ చేస్తాడ‌నుకున్నారు..?

నాగి మొదటి సినిమా నుంచి తనతో జర్నీ చేస్తున్నాం. ఎంత పెద్ద సినిమా అయినా అత‌ను తీయగలడనే న‌మ్మ‌కం ఉంది. అదే విష‌యం మా అమ్మాయిల‌కు కూడా చెప్పాను. కల్కి 2898 AD మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ ఇంకా ఏం కావాలని అడగడం తప్పా నేను ఎప్పుడు ఎక్కడ ఇంటర్ ఫియర్ కాలేదు.

అమితాబ్ బ‌చ్చన్ ని అలాంటి పాత్రలో చూడటం ఎలా అనిపించింది..?

ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ ఏం అనుకున్నారో అలానే తీశారు. అమితాబ్ లాంటి సీనియ‌ర్ యాక్ట‌ర్ ను నాగి చూపెట్టిన విధానం సూప‌ర్బ్. హ్యాట్సాఫ్ టు హిమ్.

క‌ల్కి పార్ట్ 2 ఐడియా మందునుండే ఉందా ?

ఈ స్టొరీ అనుకున్నప్పుడే పార్ట్ 2 గురించి ఆలోచించాం. కమల్ హాసన్ ఎంటరైన తర్వాత పార్ట్ 2 పై డిసైడ్ అయిపోయాం.

కల్కి విషయంలో ఎలాంటి టెన్షన్ పడ్డారు?

టెన్షన్ ఏమీ ప‌డలేదు. సినిమాను వేస‌విలో రిలీజ్ చేస్తే బావుంటుందని అనుకున్నాం. కానీ మే 9 పోస్ట్ పోన్ అయ్యింది. ఆ తర్వాత జూన్ 27 కరెక్ట్ అనుకోని ఆ తేదీన రిలీజ్ చేశాం. ఈ సినిమా అఖండ విజయం సాధిస్తుందనే ఉద్దేశంతోనే తీశాం. ఆ ఉద్దేశం నెరవేరింది.

కల్కి పార్ట్ 2 ఎప్పుడు రిలీజ్ చేస్తారు..?

ఇప్పుడే ఏమీ చెప్ప‌లేం. వచ్చే ఏడాదిలో ఖ‌చ్చితంగా సినిమాను రిలీజ్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తాం.

మహాభారతం సబ్జెక్ట్ చేయడం భయం అనిపించలేదా?

నాగి ఈ కథ చెప్పినప్పుడు చాలా పగడ్భందీగా ఫెంటాస్టిక్ గా చెప్పారు. దీంతో నేను ఎలాంటి ప్రశ్న వేయలేదు.

ప్రభాస్ గారి కోపరేషన్ ఎలా వుంది ?

చాలా బావుంది. ప్రభాస్ కోపరేషన్ లేకపోతే అసలు సినిమా బయటకు రాదు. డార్లింగ్ అంటే నిజంగా డార్లింగ్ లానే పని చేశారు.

వైజయంతి మూవీస్ 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ చేస్తున్నారా?

ఇదొక అద్భుతమైన ప్రయాణం. నా మొదటి సినిమా నుంచి, నేటి కల్కి వరకు అందరికీ రుణపడి ఉంటాను. నటీనటులు, టెక్నిషియన్స్ అందరూ సొంత మనిషిలా నన్ను దగ్గరకు చేర్చుకుని సినిమాలు చేశారు.

టీడీపీ అధికారంలోకి వ‌చ్చింది. ఇండస్ట్రీకి ఎలా ఉండబోతుంది?

ఇకపై చింత పడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు గారు అద్భుతంగా అభివృద్ధి చేస్తారు. పరిశ్రమకు అద్భుతంగా ఉంటుంది.

కల్కి సినిమాటిక్ యూనివర్స్ లో ఇంకా ఎన్ని పార్ట్స్ రావచ్చు..?

ఈ రెండే వస్తాయి. తర్వాత ఎలా ఉంటుందనేది స్క్రిప్ట్ ను బట్టి చూడాలి.

వైజయంతి మూవీస్ నుంచి రాబోయే సినిమాలు..?

శ్రీకాంత్ గారి అబ్బాయి తో ఓ సినిమా ఉంటుంది. అలాగే దుల్కర్ సల్మాన్ తో కూడా ఓ సినిమా చేస్తున్నాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు