నైజాంలో మొదటి రోజు “కల్కి” రికార్డు వసూళ్లు.!


ప్రస్తుతం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చిన అవైటెడ్ పాన్ ఇండియా సినిమా “కల్కి 2898 ఎడి” కోసం అందరికీ తెలిసిందే. రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా దిశా పటాని (Disha Patani) హీరోయిన్ గా యూనివర్సల్ హీరో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లు సాలిడ్ పాత్రల్లో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన అవైటెడ్ భారీ చిత్రమే ఇది. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా చూసేందుకు ప్రభాస్ అభిమానులే కాకుండా ఓవరాల్ అన్ని వర్గాల ఆడియెన్స్ కూడా ఎంతో ఆసక్తి కనబరిచారు.

అలా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో కల్కి ఒక రికార్డు బ్రేకింగ్ వసూళ్లు కొల్లగొడుతున్నట్టుగా తెలుస్తుంది. కాగా ఇలా నైజాం మార్కెట్ లో కల్కి ఓపెనింగ్స్ కోసం తెలుస్తుంది. పి ఆర్ నంబర్స్ ప్రకారం ఈ చిత్రానికి నైజాం లో భారీ మొత్తం 19.5 కోట్ల షేర్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇది ఆల్ టైం టాప్ 2 గా నిలిచింది. మొదటి స్థానంలో RRR నిలిచింది. దీనితో ఒక్క నైజాం లోనే సుమారు 40 కోట్ల మేర గ్రాస్ ని మొదటి రోజుకే కల్కి రాబట్టేసింది అని చెప్పాలి. ఇక రానున్న రోజుల్లో వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి.

Exit mobile version