అక్కడ “సలార్” డిస్ట్రిబ్యూటర్స్ కే “కల్కి” కూడా!?

అక్కడ “సలార్” డిస్ట్రిబ్యూటర్స్ కే “కల్కి” కూడా!?

Published on May 24, 2024 9:55 AM IST


ఇప్పుడు ఇండియన్ సినిమా నుంచి మంచి మోస్ట్ అవైటెడ్ గా ఉన్న భారీ చిత్రాల్లో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న క్రేజీ చిత్రం “కల్కి 2898 ఎడి” కూడా ఒకటి. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఇప్పుడు అంతకంతకూ పెరుగుతూ వెళ్తున్నాయి. ఇక దీనికి ముందు ప్రభాస్ “సలార్” (Salaar) చిత్రంతో సెన్సేషనల్ హిట్ అందుకోవడంతో దీనితో తన హిట్ స్ట్రీక్ ని కొనసాగించాలి అని అభిమానులు కోరుకుంటున్నారు.

ఇక కల్కి బిజినెస్ కూడా భారీ లెవెల్లో జరుగుతుండగా ఇపుడు యూఎస్ మార్కెట్ కి సంబంధించి లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. మరి గతంలో సలార్ సినిమాని యూఎస్ లో డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రముఖ సంస్థ ప్రత్యంగిరా వారే ఈసారి కల్కి చిత్రాన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేయనున్నట్టుగా వినిపిస్తుంది. ఇక దీనిపై అఫీషియల్ క్లారిటీ కూడా రానుంది. మరి కల్కి పెర్ఫామెన్స్ యూఎస్ లో ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ భారీ సినిమాలో కమల్ (Kamal Haasan), అమితాబ్ లాంటి దిగ్గజాలతో దీపికా పదుకోణ్ (Deepika Padukone), దిశా పటాని (Disha Patani) తదితరులు నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు