యూఎస్ ప్రీమియ‌ర్ల‌తో ‘క‌ల్కి’ ఆల్ టైమ్ రికార్డ్

యూఎస్ ప్రీమియ‌ర్ల‌తో ‘క‌ల్కి’ ఆల్ టైమ్ రికార్డ్

Published on Jun 27, 2024 1:00 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ లేటెస్ట్ సెన్సేష‌న్ ‘క‌ల్కి 2898 AD’ నేడు థియేట‌ర్లలో రిలీజ్ అయ్యింది. మైథాల‌జీ, సైన్స్ ఫిక్ష‌న్ అంశాల‌తో తెర‌కెక్కిన ఈ సినిమాను ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ అత్య‌ద్భుత విజువ‌ల్స్ తో రూపొందించారు. ఇక ఈ సినిమాకు బెనిఫిట్ షో, ప్రీమియ‌ర్ల నుండే పాజిటివ్ టాక్ వ‌స్తుండ‌టంతో అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

క‌ల్కి మూవీపై ఓవ‌ర్సీస్ లోనూ సాలిడ్ అంచ‌నాలు క్రియేట్ అయ్యాయి. ఇప్ప‌టికే అక్క‌డ ప్రీమియ‌ర్ల రూపంలో ఈ సినిమాను ప్రేక్ష‌కులు వీక్షించారు. ఈ ప్రీమియ‌ర్ల‌కు భారీ స్పంద‌న ల‌భించిన‌ట్లుగా చిత్ర వ‌ర్గాలు చెబుతున్నాయి. నార్త్ అమెరికాలో క‌ల్కి సినిమా కేవ‌లం ప్రీమియ‌ర్ల రూపంలోనే 3.5 మిలియ‌న్ డాల‌ర్ల‌కు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన‌ట్లుగా తెలుస్తోంది.

ఇది ఆల్ టైమ్ రికార్డు అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాలో అమితాబ్ బ‌చ్చ‌న్, క‌మ‌ల్ హాస‌న్, దీపిక ప‌దుకొనె, దిశా ప‌టాని త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమాను సి.అశ్వినిద‌త్ అత్యంత భారీ బ‌డ్జెట్ తో ప్రొడ్యూస్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు