హిందీలోనూ ఆగ‌ని ‘క‌ల్కి’ జోరు..!

హిందీలోనూ ఆగ‌ని ‘క‌ల్కి’ జోరు..!

Published on Jun 29, 2024 5:01 PM IST

బాక్సాఫీస్ వ‌ద్ద ‘క‌ల్కి 2898 AD’ జోరు ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. భారీ అంచ‌నాల మధ్య రిలీజ్ అయిన ఈ పాన్ ఇండియా మూవీకి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. నాగ్ అశ్విన్ విజన‌రీ టేకింగ్ తో ఈ సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాడ‌ని అభిమానులు మురిసిపోతున్నారు. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ ఎందుక‌య్యాడో, ఈ సినిమాతో మ‌రోసారి ప్రూవ్ చేశాడ‌ని ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు.

మైథాల‌జి, సైన్స్ ఫిక్ష‌న్ అంశాల‌తోనూ బాక్సాఫీస్ ను కొల్ల‌గొట్టవ‌చ్చ‌ని క‌ల్కి మూవీ ప్రూవ్ చేసింది. టీజ‌ర్, ట్రైల‌ర్లతో ఏర్ప‌డిన అంచనాల‌కు మించి క‌ల్కి మూవీ ఉంద‌ని ఈ సినిమా చూసిన ఆడియెన్స్ చెబుతున్నారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. హిందీలోనూ ఈ మూవీకి సాలిడ్ రెస్పాన్స్ ల‌భిస్తోంది. దేశ‌వ్యాప్తంగా క‌ల్కి మూవీ హిందీ వ‌ర్ష‌న్ కు తొలిరోజు రూ.22 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు వ‌చ్చాయి. ఇక రెండో రోజు కూడా అదే సీన్ రిపీట్ అయ్యింది.

శుక్రవారం రోజున క‌ల్కి హిందీ వ‌ర్ష‌న్ ఏకంగా రూ.23.25 కోట్లు వ‌సూలు చేసిన‌ట్లుగా లెక్క‌లు చెబుతున్నాయి. దీంతో కేవ‌లం రెండు రోజుల్లోనే ఈ సినిమా హిందీ వ‌ర్ష‌న్ లో రూ.45.75 కోట్లు రాబ‌ట్టింది. ఇక ఈ క‌లెక్ష‌న్స్ శ‌ని,ఆది వారాల్లో మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు