నాలుగు రోజుల్లో రూ.555 కోట్లతో ‘క‌ల్కి’ సెన్సేష‌న్

నాలుగు రోజుల్లో రూ.555 కోట్లతో ‘క‌ల్కి’ సెన్సేష‌న్

Published on Jul 1, 2024 1:53 PM IST

ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘క‌ల్కి 2898 AD’ వ‌ర‌ల్డ్ వైడ్ గా రికార్డుల‌ను తిర‌గరాస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ మ‌రోసారి త‌న ప్ర‌త్యేక‌త‌ను ఈ సినిమా వ‌సూళ్ల‌తో నిరూపించుకున్నాడు. ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ తెరెకెక్కించిన ఈ సై ఫై ఎపిక్ మూవీకి ప్రేక్షకులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.

ఫ‌లితంగా ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని చోట్ల సాలిడ్ వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది. క‌ల్కి సినిమా రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే ప‌లు కొత్త రికార్డుల‌ను క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా నాలుగు రోజుల్లో ఏకంగా రూ.555 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన‌ట్లుగా చిత్ర యూనిట్ తాజాగా ప్ర‌క‌టించింది. కేవ‌లం తొలి వీకెండ్ లోనే ఈ ఫీట్ సాధించిన క‌ల్కి మూవీ, మున్ముందు ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అభిమానులు ఆస‌క్తిగా చూస్తున్నారు.

మ‌హాభార‌తం స‌న్నివేశాల‌ను భ‌విష్య‌త్ కాలానికి లింక్ చేసి తీసిన ‘క‌ల్కి’ మూవీ ప్రేక్ష‌కులకు స‌రికొత్త అనుభూతిని ఇస్తోంది. ఈ సినిమాలో భారీ తారాగ‌ణం న‌టించ‌గా, సంతోష్ నారాయ‌ణ‌న్ సంగీతం అందించారు. వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్ పై సి.అశ్వినీద‌త్ ఈ సినిమాను అత్యంత భారీ బ‌డ్జెట్ తో ప్రొడ్యూస్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు