Kalki 2898 AD: ‘కల్కి 2898 AD’ చిత్రానికి అరుదైన గౌరవం

Kalki 2898 AD: ‘కల్కి 2898 AD’ చిత్రానికి అరుదైన గౌరవం

Published on Sep 25, 2024 9:08 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రీసెంట్ మూవీ ‘కల్కి 2898 AD’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో ప్రభాస్ సరికొత్త గెటప్‌లో కనిపించి ప్రేక్షకులను థ్రిల్ చేశాడు. ఇక ఈ సినిమా వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.1200 కోట్ల వసూళ్లు రాబట్టి రికార్డును క్రియేట్ చేసింది.

ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా ఇతర భాషల్లోనూ సత్తా చాటింది. ఓవర్సీస్‌లో కల్కి 2898 AD ప్రభంజనం సృష్టించి సరికొత్త రికార్డులను తనపేరిట వేసుకుంది. అయితే, ఇప్పుడు ఈ సినిమాకు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అరుదైన గౌరవం దక్కనుంది. 29వ బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కల్కి 2898 AD స్పెషల్ షో‌కి ఎంపికైంది. ఓపెన్ కేటగిరిలో ఈ సినిమాను ఎంపిక చేశారు.

అక్టోబర్ 2 నుంచి 11 వరకు జరిగే 29వ బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కల్కి 2898 AD’ చిత్రాన్ని అతిపెద్ద ఓపెన్ థియేటర్‌లో ప్రదర్శించనున్నారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపిక పదుకొనె, దిశా పటాని తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు