ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసిన “కల్కి”

ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసిన “కల్కి”

Published on Jun 30, 2024 11:57 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898ఎడి. జూన్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులని, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతున్న ఈ చిత్రం, నార్త్ అమెరికా లో ఆల్ టైమ్ రికార్డు ను క్రియేట్ చేయడం జరిగింది. ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ కి 10.5 మిలియన్ డాలర్లకి పైగా వసూళ్లు రాబట్టి, సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది.

ఇండియా తరఫున ఏ చిత్రానికి అయినా, మొదటి వారాంతం కి ఇదే హయ్యెస్ట్. ఈ చిత్రం ఇదే దూకుడు కొనసాగిస్తే, లాంగ్ రన్ లో మరిన్ని రికార్డులను బ్రేక్ చేయడం ఖాయం. ఈ భారీ బడ్జెట్ మూవీలో దీపికా పదుకునే, దిశా పటాని, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు