రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా, డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898ఏ. డి (Kalki2898 AD) జూన్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కి రెడీ అయిపోయింది. ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలు సినిమా పై మంచి హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం నార్త్ అమెరికా లో థియేట్రికల్ రిలీజ్ పై ఒక క్లారిటీ వచ్చింది. ప్రత్యంగిర సినిమాస్ మరియు AA క్రియేషన్స్ వారు నార్త్ అమెరికా లో సినిమా ను రిలీజ్ చేయనున్నారు. జూన్ 26 వ తేదీన ప్రిమియర్ షోలతో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు దీపికా పదుకునే, దిశా పటాని లు ఫిమేల్ లీడ్ రోల్స్ లో నటిస్తుండగా, యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంతోష్ నారాయణన్ అధ్బుతమైన సంగీతం అందిస్తున్నారు.