ఇది మీకు తెలుసా? దీపిక ‘క‌ల్కి’ కంటే ముందే తెలుగు నటించిన సినిమా వేరే ఉందని

ఇది మీకు తెలుసా? దీపిక ‘క‌ల్కి’ కంటే ముందే తెలుగు నటించిన సినిమా వేరే ఉందని

Published on Jun 25, 2024 4:13 PM IST

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘క‌ల్కి 2898 AD’ ఫీవ‌ర్ నెల‌కొంది. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న ఈ ప్రెస్టీజియ‌స్ మూవీని దర్శ‌కుడు నాగ్ అశ్విన్ తెర‌కెక్కిస్తున్నాడు. పూర్తి సైన్స్ ఫిక్ష‌న్ క‌థ‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించేందుకు సిద్ధ‌మ‌య్యింది. ఇక ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉండ‌గా, ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది బాలీవుడ్ భామ దీపిక ప‌దుకొనె. ఆమె పాత్ర ఈ సినిమాకు చాలా కీల‌కం కానుంద‌ని చిత్ర యూనిట్ కూడా చెబుతూ వ‌స్తోంది.

అయితే, దీపిక ప‌దుకొనె తెలుగులో తొలిసారి స్ట్రెయిట్ మూవీలో న‌టిస్తుంద‌ని చాలా మంది అనుకుంటున్నారు. కానీ, దీపిక గతంలోనే ఓ తెలుగు సినిమాలో న‌టించిన సంగతి చాలా త‌క్కువ మందికి తెలుసు. ద‌ర్శ‌కుడు జ‌యంత్ సి ప‌రాన్జీ ‘ల‌వ్ 4 ఎవ‌ర్’ అనే సినిమాను 2009 లో తెర‌కెక్కించారు. ఈ సినిమాలో ర‌ణదీప్ హీరోగా న‌టించ‌గా మృదులా హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమాలో దీపిక ప‌దుకొనె ఓ కీల‌క పాత్ర‌లో న‌టించింది.

కానీ, కొన్ని కార‌ణాల వ‌ల్ల ఈ సినిమా రిలీజ్ కాలేదు. దీంతో దీపిక టాలీవుడ్ ఎంట్రీ అప్పుడు జ‌ర‌గలేదు. ఇప్పుడు ‘క‌ల్కి’ సినిమాతో ఆమె టాలీవుడ్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మ‌రి ఈ సినిమాలో ఆమె పాత్ర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌మేర అల‌రిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు