“కల్కి” 25 డేస్ పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్!

“కల్కి” 25 డేస్ పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్!

Published on Jul 21, 2024 8:00 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898ఎడి. ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకు పోతున్న ఈ చిత్రం 25 రోజులను పూర్తి చేసుకుంది. మేకర్స్ తాజాగా సరికొత్త పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. కర్ణ పాత్రలో ప్రభాస్ లుక్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. ప్రేక్షకులను, అభిమానులని విశేషంగా అలరిస్తోంది.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే, దిశా పటాని, యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ లు ముఖ్య పాత్రల్లో నటించగా, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు