అక్కడ కూడా ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసిన “కల్కి”

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తొలిరోజు అన్ని చోట్ల అధ్బుతమైన బుకింగ్స్ ను తో దూసుకు పోతుంది. ఈ చిత్రం నార్త్ అమెరికా లో ఇప్పటికే ఆల్ టైమ్ రికార్డు ను క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు యూకే ప్రాంతంలో కూడా ఈ చిత్రం ఆల్ టైమ్ రికార్డు ను క్రియేట్ చేయడం జరిగింది. తెలుగు ప్రీమియర్ షో ల హయ్యెస్ట్ గ్రాస్ ఇక నుండి కల్కి పేరిట ఉండనుంది. ఈ చిత్రం 235, 571కే కి పైగా వసూళ్లు రాబట్టింది. ఇది సెన్సేషన్ రెస్పాన్స్ అని చెప్పాలి.

సినిమాకి మంచి రివ్యూలు రావడం, మౌత్ టాక్ కూడా బాగుండటం తో సినిమా భారీ వసూళ్లతో దూసుకు పోనుంది. ఈ చిత్రం మున్ముందు ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ చిత్రం లో దీపికా పదుకునే, దిశా పటాని, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Exit mobile version