UKలో ‘క‌ల్కి’ ఆల్ టైమ్ రికార్డు..!

UKలో ‘క‌ల్కి’ ఆల్ టైమ్ రికార్డు..!

Published on Jun 22, 2024 10:01 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ నటించిన ‘క‌ల్కి 2898 AD’ వ‌చ్చే వారంలో రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించ‌గా, పూర్తి సైన్స్ ఫిక్ష‌న్ మూవీగా ఇది రానుంది. ఇక ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపించేందుకు ప్ర‌భాస్ సిద్ధ‌మ‌య్యాడు. కాగా, ఈ సినిమాను ప్రపంచ‌వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు మేక‌ర్స్.

కేవ‌లం ఇండియాలోనే కాకుండా ఓవ‌ర్సీస్ లోనూ ఈ సినిమా భారీగా రిలీజ్ అవుతోంది. ఇప్ప‌టికే యూఎస్ లో ‘క‌ల్కి’ ఫీవ‌ర్ మొద‌ల‌వ‌గా, యూకే లో కూడా ప్ర‌భాస్ మేనియాతో ఆడియెన్స్ ఊగిపోతున్నారు. ఈ సినిమా అడ్వాన్స్ టికెట్ల కోసం జ‌నం ఎగ‌బ‌డుతున్నారు. యూకేలో ‘కల్కి’ మూవీ ఏకంగా 400 కు పైగా లొకేష‌న్ల‌లో భారీ స్థాయిలో రిలీజ్ అవుతోంది. ఇది ఆల్ టైమ్ రికార్డు అని మేక‌ర్స్ తెలిపారు.

ఇక ఈ సినిమాను యూకేలో జూన్ 26న ప్రీమియ‌ర్లు వేయ‌నున్నారు. అమితాబ్ బచ్చ‌న్, క‌మ‌ల్ హాస‌న్, దీపిక ప‌దుకొనె, దిశా ప‌టాని త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యాన‌ర్ పై సి.అశ్విని ద‌త్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు