“కల్కి” చిత్రంలో 3 డిఫెరెంట్ వరల్డ్స్ క్రియేషన్ పై ఆర్ట్ డైరెక్టర్ కామెంట్స్!

“కల్కి” చిత్రంలో 3 డిఫెరెంట్ వరల్డ్స్ క్రియేషన్ పై ఆర్ట్ డైరెక్టర్ కామెంట్స్!

Published on Jul 24, 2024 8:28 PM IST

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898ఎడి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. వెయ్యి కోట్ల రూపాయలకి పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం పై ఆర్ట్ డైరెక్టర్ అనిల్ జాదవ్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ చిత్రం కోసం మూడు డిఫెరెంట్ వరల్డ్స్ ను క్రియేట్ చేసినట్లు చెప్పారు. కాశీ, శంభాళ, కాంప్లెక్స్ లని ఎలా డిజైన్ చేశారో వివరించారు. ప్రభాస్ మరియు దిశా పటాని ల సాంగ్ ను ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించిన విధానాన్ని వీడియోలో వెల్లడించారు. మేకర్స్ రిలీజ్ చేసిన ఈ వీడియో ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుంది.

ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే ఫీమేల్ లీడ్ రోల్ లో నటించగా, యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ లు ముఖ్య పాత్రల్లో నటించారు. బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ లు కీలక పాత్రల్లో నటించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై గ్రాండ్ గా నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు