ఏపీ లో ప్రారంభమైన “కల్కి2898 AD” బుకింగ్స్!

ఏపీ లో ప్రారంభమైన “కల్కి2898 AD” బుకింగ్స్!

Published on Jun 25, 2024 10:01 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898AD చిత్రం జూన్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజైన ప్రచార చిత్రాలకి ఇప్పటికే సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దాదాపు అన్ని ప్రాంతాల్లో కల్కి చిత్రం యొక్క అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అన్ని చోట్ల సాలిడ్ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఈ ప్రాంతంలో ఇప్పటికే అదనపు షో లతో పాటుగా, టికెట్ ధరల పెంపు కూడా జరిగింది. ఈ ప్రాంతంలో కల్కి మంచి వసూళ్లను రాబట్టడం ఖాయం.

దీపికా పదుకునే, దిశా పటాని, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన తదితరులు నటించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు