హిందీ బాక్సాఫీస్ వద్ద “కల్కి” లేటెస్ట్ వసూళ్లు ఇవే!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి2898ఎడి. ఈ చిత్రం జూన్ 27 వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకు పోతుంది. ఇప్పటికే ఈ చిత్రం 1100 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టడం జరిగింది. హిందీ వెర్షన్ కూడా ఈ చిత్రం మంచి రెస్పాన్స్ తో దూసుకు పోతుంది. డెడ్ పూల్ అండ్ వుల్వరీన్ చిత్రం రిలీజైనప్పటికీ ఉన్న కొద్ది థియేటర్ల లో కూడా మంచి హోల్డ్ ను కనబరుస్తోంది.

ఈ చిత్రం ఐదో వారాంతం 5 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టడం జరిగింది. దీంతో హిందీలో మొత్తం 286.35 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టడం జరిగింది. దీపికా పదుకునే, దిశా పటాని, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.

Exit mobile version