ప్రభాస్ “కల్కి” హిందీ లేటెస్ట్ వసూళ్లు ఇవే!

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రభంజనం బాక్సాఫీస్ వద్ద కొనసాగుతుంది. టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898ఎడి చిత్రం భారీ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకు పోతుంది. ఈ చిత్రం హిందీ వెర్షన్ లో కూడా సాలిడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. నార్త్ ఇండియా లో ఈ చిత్రం మంగళవారం రోజున 5.15 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టడం జరిగింది. ఇది సెన్సేషన్ రెస్పాన్స్ అని చెప్పాలి. వీక్ డేస్ లో కూడా ఈ రేంజ్ వసూళ్లు రాబట్టడం గొప్పం విషయం. ఈ చిత్రం ఇప్పటి వరకూ అక్కడ 224.40 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది.

ఈ ఏడాది బాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం గా కల్కి నిలిచింది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే, దిశా పటాని, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Exit mobile version